హైదరాబాద్ : నిజంగా కేసీయార్ కు పెద్ద షాక్

Vijaya



తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ కు నిజంగా పెద్ద షాకే తగిలింది. ముఖ్యమంత్రి అన్న హోదా తప్ప జాతీయస్ధాయిలో కేసీయార్ దాదాపు ఒంటరైపోయారు. జాతీయస్ధాయిలో తెలంగాణా ముఖ్యమంత్రిని పట్టించుకుంటున్న పార్టీయే లేదు. ఎన్ని పార్టీల వెనుక కేసీయార్ పడుతున్నా భోజనం పెట్టి టాటా చెబుతున్నారే కానీ తర్వాతెవరు ఆలోచిస్తున్నలేదు. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.



తొందరలోనే ముంబైయ్ వేదికగా బీజేపేయేతర ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. శివశేన ఈ సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఎందుకంటే ఈ విషయాన్ని ప్రకటించింది శివశేన ఎంపి సంజయ్ రౌత్ కాబట్టే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ఈ విషయమై ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాధి, మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో కూడా మాట్లాడినట్లు రౌత్ చెప్పారు చూడబోతే ఆ సమావేశానికి కేసీయార్ కు ఆహ్వానం వస్తుందనే నమ్మకం కూడా లేదు.



ఎందుకంటే దేశంలో విద్వేష రాజకీయాలు పెరిగిపోతున్నాయంటు నరేంద్రమోడికి ఒక లేఖ అందింది. ఆ లేఖను రాసింది జాతీయస్ధాయిలోని వివిధ పార్టీల అధినేతలు. ఆ లేఖలో సోనియా గాంధీతో పాటు చాలామంది ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతల సంతకాలున్నాయి. అయితే ఈ విషయంలో కేసీయార్ ను ఎవరు సంప్రదించినట్లు లేదు. అందుకనే మీడియాలో లేఖ విషయం వచ్చేంతవరకు కేసీయార్ కు కూడా తెలీదు. అంటే దాదాపు అన్నీపార్టీలు కేసీయార్ ను బ్లైండ్ లో ఉంచేశాయి.



జరుగుతున్నదాన్నిబట్టి అర్ధమవుతున్నదేమంటే జాతీయస్ధాయిలో చాలామంది కేసీయార్ ను నమ్ముతున్నట్లు లేదు. కేసీయార్ ట్రాక్ రికార్డే దీనికి కారణం. నిజానికి కాంగ్రెస్ లేకుండా జాతీయస్ధాయిలో బీజేపీతో పోరు సాధ్యంకాదు. అందుకనే ఇంతకాలం మంకుపట్టు పట్టిన మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ తో కలిసి పనిచేయటానికి అంగీకరిస్తున్నారు. ఇక్కడే కేసీయార్ దాదాపు ఒంటరైపోయారు. నిజంగా కేసీయార్ కు ఇది పెద్ద షాకనే చెప్పాలి. మరి తాజా పరిణామాల నేపధ్యంలో అందరితో కలిసే ప్రయత్నం చేస్తారో లేకపోతే ఒంటరిగానే మిగిలిపోతారో కేసీయార్ తేల్చుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: