వరుడు 36 అంగుళాలు.. వధువు 34 అంగుళాలు.. ఇద్దరికీ పెళ్లి?

praveen
ఇటీవలికాలంలో పెళ్లిళ్లు ఎంత అంగరంగ  వైభవంగా జరుగుతున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు తమ పెళ్ళి ఘనంగా జరుపుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఖర్చుకు వెనకాడకుండా ఇక జీవితాంతం గుర్తుండిపోయే విధంగా  పెళ్లిని ప్రత్యేకంగా మార్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెళ్లి జరుగుతుంది అంటే ఆ సందడి మామూలుగా ఉండటం లేదు. అంతే కాకుండా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ  సోషల్ మీడియాలో పెళ్లిని హాట్ టాపిక్ గా మారేలా చేస్తున్నారు అని చెప్పాలి.

 ఇప్పుడు ఒక పెళ్ళికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా పెళ్ళి చేసుకోవాలనుకున్న యువతి ఆరడుగుల అందగాడు ఆజానుబాహుడులా ఉండే వరుడు కావాలని కోరుకుంటుంది.. ఇక అదే సమయంలో వరుడు కూడా  భువి నుంచి దివికి దిగివచ్చిన అందగత్తెల తనకు కాబోయే భార్య ఉండాలి అనుకుంటాడు. అయితే ఇక్కడ పెళ్లి చేసుకున్న జంట మాత్రం ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. మా దగ్గర హైట్ లేకపోతే ఏంటి జీవితాంతం కలిసి ఉండే అంత ప్రేమ ఉంది అని ఇక్కడ ఒక జంట  నిరూపించింది.

 బీహార్లోని భాగల్పూర్ లో జరిగిన ఒక అరుదైన మ్యారేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గోపాల్పూర్ బ్లాక్ లో ఇద్దరు మరుగుజ్జు వధూవరులకు పెళ్లి చేసుకున్నారు. వరుడు ఎత్తు కేవలం 36 అంగుళాలు మాత్రమే అదేంటి వధువు అలాంటి వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది అని అనుకుంటున్నారు కదా.. వధువు ఎత్తు 34 అంగుళాలు కావడం గమనార్హం. ఇద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ జంట తో ఫోటోలు దిగేందుకు అక్కడున్న వారు ఎక్కువగా ఆసక్తి చూపారు. తాను డాన్స్ పార్టీలో ఆర్టిస్టుగా పని చేస్తానని తన భార్యకు ఎలాంటి సమస్య రాకుండా ఎంతో సంతోషంగా చూసుకుంటాను అంటూ చెబుతున్నాడు వరుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: