తెలంగాణాలో పెరిగిన కరోనా కేసులు..ఒకరోజుకు ఎన్నో తెలుసా?
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25వేల 585 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 540 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 272 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 21, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26 కేసులు, ఖమ్మంలో 15 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 708 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. మరో ఊరటనిచ్చే అంశం.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8,10,318 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 01వేల 726 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 481కి చేరింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 21వేల 616 కరోనా టెస్టులు చేయగా.. 441 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది..కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది..మరోసారి కూడా అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.