మీ బ్యాంక్ అకౌంట్ ను వేరే బ్రాంచ్‌కు ఎలా మార్చుకోవాలో తెలుసా?

Satvika
ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అవసరం..ఉద్యోగాలు చేస్తున్న వారికి అయితే తప్పనిసరి..మాములుగా బ్యాంక్ అకౌంట్ లను మనం వున్న ప్రాంతంలో తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల బ్యాంక్ లావాదేవీలను చెయ్యడం చాలా కష్టంగా మారుతుంది.అలాంటి సమయంలో అకౌంట్ ను వేరే బ్రాంచ్‌కు మార్చుకోవాల్సి వస్తుంది..అయితే అలా చెయ్యాలంటే సంబంధిత బ్యాంక్ కు వెల్లాల్సిందే..చాలా మంది తమ బ్యాంక్‌ అకౌంట్‌ను ఒక బ్రాంచ్‌ నుంచి మరో బ్రాంచ్‌కు మార్చుకుంటుంటారు. 



ముఖ్యంగా ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రాన్స్‌ఫర్‌ అయిన వారు ఖాతాను తామకు నచ్చిన బ్రాంచ్‌కు మార్చుకోవాలనుకుంటారు. ఇందుకోసం బ్యాంకుకు వెళ్లి, అప్లికేషన్‌ ఫామ్‌ను నింపి పెద్ద పనే ఉంటుంది. కానీ అలా కాకుండా ఇంట్లోనే ఉంటూ, గడప కూడా అడుగు పెట్టకుండా ఆన్‌లైన్‌లో ఈ పని చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ. అందుకే మీలాంటి వారి కోసమే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గొప్ప అవకాశం తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో సింపుల్‌ స్టెప్స్‌ ద్వారా బ్రాంచ్‌ను మార్చుకోవచ్చు. ఎలాగంటే..


*.ఇందుకోసం ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ ‘www.onlinesbi.com’లోకి వెళ్లాలి.


* అనంతరం ‘పర్సనల్‌ బ్యాంకింగ్‌’ క్లిక్‌ చేసి పాస్‌వర్డ్‌, యూజర్‌నేమ్‌తో లాగిన్‌ కావాలి.
* అనంతరం ‘ఈ-సర్వీస్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
* తర్వాత అందులో ఉండే ‘ట్రాన్సఫర్‌ ఆఫ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌’పై క్లిక్‌ చేయాలి.
* వెంటనే ఎస్‌బీఐలో మీకున్న అకౌంట్‌ జాబితా వస్తుంది. బ్రాంచ్‌ మార్చుకోవాలనుకుంటున్న అకౌంట్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.
* ఆ తర్వాత మీరు ఏ బ్రాంచ్‌కు మార్చుకోవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్‌ పేరు టైప్‌ చేసి సెలక్ట్ చేసుకోవాలి.
* తర్వాత చివరల్లో కనిపించే సబ్‌మిట్ బటన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే పాత బ్రాంచ్‌ కోడ్‌, కొత్త బ్రాంచ్‌ కోడ్‌ను ఎంటర్‌ చేసి వెరిఫై చేయాలి.
* కాన్ఫామ్‌ బటన్‌ను నొక్కగానే ఓటీపీ వస్తుంది. అనంతరం ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి కాన్ఫామ్‌ కొట్టాలి.
* దీంతో చివరల్లో మీ బ్యాంక్‌ బ్రాంచ్‌ విజయవంతంగా మారినట్లు మెసేజ్‌ చూపిస్తుంది..అంటే బ్యాంక్ బ్రాంచ్ మారిందని అర్థం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Sbi

సంబంధిత వార్తలు: