బీమా డబ్బు కోసం కన్న తండ్రినే చంపిన కొడుకు?

frame బీమా డబ్బు కోసం కన్న తండ్రినే చంపిన కొడుకు?

Purushottham Vinay
బీమా డబ్బు కోసం కన్న తండ్రినే చంపిన కొడుకు?

ఫించన్ డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను వేధించే కొడుకులు కూతుళ్లు సమాజంలో చాలా మందే ఉంటారు. అయితే బీమా డబ్బుల కోసం కని పెంచిన కన్నతండ్రినే ఓ కసాయి కొడుకు హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే బొంరాస్ పేట మండలంలోని బిక్యానాయక్ తండాకు చెందిన రాథోడ్ ధన్ సింగ్ (68) కు మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు తాండూరులో ఉంటున్నాడు. మరో ఇద్దరు కుమారులైన రవినాయక్ ఇంకా శ్రీనివాస్ నాయక్ తండ్రితోనే తండాలో వుంటున్నారు. అయితే చిన్న కుమారుడు శ్రీనివాస్ నాయక్ తండ్రి పేరుతో ఓ ప్రైవేటు బీమా సంస్థలో రూ.50 లక్షలు ప్రమాదం బీమాని చేయించాడు. ఇంకా అలాగే నామినీగా తన పేరు నమోదు చేసుకున్నాడు.అయితే గత రెండు మూడు రోజుల నుంచి తనకు బాగా డబ్బులు అవసరం ఉన్నాయని తండ్రిని శ్రీనివాస్ నాయక్ అడుగుతూనే ఉన్నాడు. 


ఇక తన దగ్గర లేవని ఆయన చెప్పడంతో శ్రీనివాస్ నాయక్ తన కసాయి బుద్దిని చూపించాడు. తాండూరులో ఉన్న అన్న దగ్గరకు వెళ్దామని అతని వద్ద డబ్బు ఇప్పించమని తన తండ్రిని కోరాడు. ఇక దీనికి తండ్రి ఒప్పుకోవడంతో మంగళవారం రోజు తెల్లవారుజామున శ్రీనివాస్ నాయక్ ఆయన్ని బైక్ పై తీసుకెళ్లాడు. కొడంగల్ మండలం ఉడిమేశ్వరం శివారులో తన ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో తండ్రి చనిపోయాడని శ్రీనివాస్ తండాకు వచ్చి అందరిని ఎంతగానో నమ్మించే ప్రయత్నం చేశాడు.అయితే కేవలం బీమా చేయించిన డబ్బుల కోసమే అతడు తండ్రిని రాయితో కొట్టి చంపాడని రెండో కొడుకు రవినాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఇక దర్యాప్తు ప్రారంభించారు.ఇక ఇలా డబ్బులు కోసం కన్న తండ్రినే పొట్టనబెట్టుకున్నాడు కసాయి పుత్రుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: