అమరావతి : కన్నా పరిస్ధితి ఇలాగైపోయిందా ?

Vijaya



‘అంతన్నాడింతన్నాడే గంగరాజు’.. అనే పాట లాగ అయిపోయింది కన్నా లక్ష్మీనారాయణ పరిస్ధితి. దాదాపు మూడునెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన కన్నా టీడీపీలో చేరారు. గుంటూరులోని తనింటి నుండి టీడీపీ ఆఫీసుకు వందల కార్లతో  ఎంతో అట్టహాసంగా కన్నా ర్యాలీ తీశారు. కన్నా అంతటి లీడర్ టీడీపీలో చేరిపోయారంటే గుంటూరు జిల్లాల్లో పార్టీకి ఇక తిరుగేలేదన్నట్లుగా ప్రచారం జరిగింది. చంద్రబాబునాయుడుతో పాటు కొందరు నేతలు కన్నా గురించి అరవీరభయంకరంగా చెప్పారు.



తీరాచూస్తే ఇఫుడు కన్నా అసలు చప్పుడే చేయటంలేదు. చేరిన కొత్తల్లో అక్కడక్కడ తిరిగి కాస్త హడావుడిచేసినా ఇపుడు స్తబ్దుగా ఉంటున్నారు. కారణం ఏమిటంటే దీనికి చంద్రబాబే కారణమని చెప్పాలి. విషయం ఏమిటంటే పార్టీలో కన్నాను చేర్చుకున్న తర్వాత ఇంతవరకు ఎలాంటి పదవి కానీ బాధ్యతలు కానీ అప్పగించలేదు. పైగా కన్నా చేరిక వల్ల మూడు నియోజకవర్గాల్లో పార్టీలో చిచ్చు మొదలైంది. పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో గొడవలు పెరిగిపోయాయి.



టీడీపీలో చేరేముందు కన్నాకు చంద్రబాబు ఏమిహామీ ఇచ్చారో తెలీదు. అయితే కన్నా మాత్రం పై మూడు నియోజకవర్గాల్లోను పర్యటించారు. దాంతో అప్పటికే టికెట్ కోసం ఆయా నియోజకవర్గాల్లో పోటీపడుతున్న తమ్ముళ్ళల్లో కన్నా రాకపోతే అయోమయం పెరిగిపోయింది. దాంతో పై నియోజకవర్గాల్లోని తమ్ముళ్ళెవరు కన్నాకు సహకరించకపోగా ప్రత్యర్ధిలాగ చూస్తున్నారు. దాంతో పార్టీలో గ్రూపులు పెరిగిపోవటంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలైనట్లయ్యింది.



కాపు నేతే అయినా కన్నాకు కాపుల్లో పెద్దగా  పట్టులేదు. అవసరానికి సామాజికవర్గాన్ని రక్షణ కవచంగా ఉపయోగించుకున్నారంతే. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి పార్టీ బలమే కన్నా బలమైందంతే. కాంగ్రెస్ ను వదిలేసిన తర్వాత కన్నా బలమేంటో తేలిపోయింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడి హోదాలో కన్నా నరసరావుపేట ఎంపీగా పోటీచేస్తే వచ్చిన ఓట్లు 15 వేలు. డిపాజిట్ కూడా రాలేదంటే కాపులు కూడా ఓట్లేయలేదనే కదా అర్ధం. దీంతోనే అందరికీ అర్ధమైపోయింది వ్యక్తిగతంగా కన్నాకున్న బలమేంటో. మరి కన్నాను పార్టీలో చేర్చుకుని చంద్రబాబు ఏ పదవి ఇవ్వకుండా, ఏ బాధ్యత అప్పగించకుండా ఎందుకు ఖాళీగా ఉంచారన్నదే అర్ధంకావటంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: