మెట్రో రైలు మీరే నిర్మించుకోండి- ఎల్.అండ్ టి

Chowdary Sirisha
హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్న మెట్రో రైలు మార్గా నిర్మాణానికి మళ్లీ చిక్కులు వచ్చేలా ఉన్నాయి.మెట్రోని నిర్మిస్తున్న ఎల్.అండ్ టి సంస్థ తాను ఈ నిర్మాణం నుంచి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నానని సంచలన ప్రకటన చేసింది.దీనిపై మెట్రో రైల్ ఎమ్.డి గా ఉన్న ఎన్.వి.ఎస్.రెడ్డి కి లేఖ రాసింది. ప్రధాన మైన అభ్యంతరం మెట్రో రైలు మార్గం మార్పు చేయాలని, ప్రత్యేకించి శాసనసభ ముందు,అలాగే సుల్తాన్ బజార్ ప్రాంతంలో ను కాకుండా భూగర్భంలోను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అదికారికంగా కాకపోయినా, ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిపై బహిరంగంగా మాట్లాడారన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.అయితే ఇది సాధ్యం కాని పనిగా ఎల్.అండ్ టి భావిస్తోంది. ఇప్పటికే పలు అంశాలలో ప్రభుత్వ సంస్థ కు, ఎల్.అండ్ టి కి మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడిన నేపధ్యంలో ఎల్.అండ్ టి ఈ లేఖ రాయడం తో పరిస్థితి గందరగోళంగా మారే ప్రమాదం ఉంది.అయితే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చొరవ తీసుకుని దీనిని పరిష్కరించుకోవడం అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: