లోకేశ్ ఫ్రెండ్ కు చంద్రబాబు ఎర్త్ పెట్టారా..!?

Chakravarthi Kalyan
అభీష్ట.. నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. లోకేశ్ కోటరీలో, స్నేహబృందంలో అతి ముఖ్యుడు. అందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయన్ను తన పేషీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించుకున్నారు.. కాదు.. కాదు.. అలా నియమించాలని లోకేశ్ ఒత్తిడి తెచ్చారు. అయితే ఆ తర్వాత కాలంలో అభీష్ట పనితీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. 

పీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభీష్ట నియమాకంపై, వ్యవహారశైలిపై అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఏకేశారు. ఓఎస్డీగా అభీష్టను నియమించేందుకు ఉన్న అర్హతలేమిటని రఘువీరా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం అంతా అభీష్ట కనుసన్నల్లో నడుస్తోందని రఘువీరా ఆరోపించారు. అభీష్ట ఎలాటి ఉత్తర్వులు, నియమాలు ,నిబందనలు లేకుండా పని చేస్తున్నారని మండిపడ్డారు. 

ఆ తర్వాత రఘువీరారెడ్డి కూడా అభీష్ట ఇష్యూని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సదరు అభీష్ట తన రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. ఇది ఇంకా కన్ ఫామ్ కావాల్సి ఉంది.  కొన్ని రోజులుగా అభీష్ట సీఎం కార్యాలయానికి రావడం లేదట. అభీష్ట పనితీరుపై ప్రతిపక్షాల నుంచే కాదు.. సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు రావడం వల్లనే ఆయన్ను పక్కకు పెట్టారని ప్రచారం సాగుతోంది. 

ఐతే.. అభీష్ట చంద్రబాబు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం వల్లనే సీఎం ఆయన్ను పక్కకుపెట్టారన్నది మరో కథనం. అయితే అభీష్ట రాజీనామా వార్తే నిజమైతే.. పార్టీలో, ప్రభుత్వంలో లోకేశ్ మాట నెగ్గే పరిస్థితులు లేవా.. అన్న సందేహాలు రాకమానవు. అసలు అబీష్ట ఎందుకు రాజీనామా చేశారు.. స్నేహితుడిని లోకేశ్ ఎందుకు కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు పార్టీలో ఎవరి మాట చెల్లుబాటవుతోంది.. వంటి అనేక ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు దొరకాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: