సెక్స్.. ఆడామగా మధ్య దైవం కల్పించిన ఆనంద సృష్టి కార్యం. ఇద్దరు గెలిచే ఈ ప్రేమ యుద్ధంలో ఏ ఒక్కరు ఓడినా మిగిలేది అసంతృప్తి.. ఆ అసంతృప్తి అసహనంగా మారి పచ్చని సంసారంలో చిచ్చుపెడుతుంది. అయితే వయసు మీద పడ్డాక సెక్స్ లో దూకుడు కొనసాగించడం కష్టమే. వీరిలో ఎక్కువగా కనిపించే సమస్య అంగస్తంభన. సెక్స్ కావాలని కోరిక ఉన్నా.. అంగం శృంగారానికి తగినంతగా స్పందించదు.
సాధారణంగా ఈ అంగస్తంభన సమస్య.. 50 ఏళ్లు దాటినవారిలో కనిపిస్తుంది. కానీ ఈ జెట్ స్పీడ్ యుగంలో ఇది 40 ఏళ్లలోపు వారిలోనూ తరచుగా కనిపిస్తోంది. ఈ సమస్య గురించి వైద్యులు జరిపిన ఓ పరిశోధన ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన ఆరోగ్యసమస్య కాదని.. దీనివల్ల శృంగారపరమైన సమస్యే కాకుండా ఏకంగా ప్రాణాల మీదకు తెస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
అంగస్తంభన సమస్య కారణంగా సంసారంలో గొడవలు రావడమే కాదు.. ఇది పురుషుల ఆయుష్షు తగ్గిస్తుందట. అకాల మరణాలకు దారి తీస్తుందట. ప్రస్తుతం 40 ఏళ్లలోపువారిలో 20 శాతం మందిని ఈ శృంగార సమస్య వేధిస్తోందట. ఒక్క అమెరికాలోనే ఈ సమస్య బాధితులు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారట. అంగస్తంభన సరిగ్గా లేని వారిలో హృదయ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువట.
అందుకే ఈ సమస్య తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు చేయించుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు. పడకగది విషయమే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుందట. సెక్సువల్ మెడిసిన్ పత్రిక ఈ వివరాలను తన తాజా సంచికలో ప్రచురించింది.