వైకాపా లో ప్రస్తుతం ఉన్న వైఖరి కొనసాగితే ప్రజారాజ్యం పార్టీ గతే పడుతుందని ఆ పార్టీ నేత, మాజీమంత్రి హరిరామజోగయ్య హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో జోగయ్య మాట్లాడాతూ, సహకార ఎన్నికలే అజెండాగా నిర్వహించిన సమావేశంలో దాని పై నాయకులు ఎలాంటి ప్రణాళికనూ ప్రకటించకపోవడంతో ఆయన ఫై విధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుండి 2008 లో ఎంపీ పదవికి రాజీనామా చేసిన జోగయ్య చిరంజీవి వంచన చేరారు.కాని ఆ తరువాత వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
ప్రజారాజ్యం పార్టీలో తను ముఖ్యుడిగా కొనసాగానని ఆ పార్టీలో ఉన్న అవలక్షణాలే వైకాపా లో కనిపిస్తున్నాయని అన్నారు. ఆ పార్టీలో పని చేసిన ఉన్న అనుభవరీత్యా, అన్ని ప్రత్యక్షంగా చుసిన వాడిగా ఈ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. జగన్ వచ్చి ఏదో చేసేస్తారని భావించవద్దని, అప్పుడు కూడా ఎవ్వరు పని చెయ్యకుండా చిరంజీవి మ్యజిక్ చేస్తాడని భావించారని, ఇప్పుడూ జగన్ బయట ఉన్నప్పుడు ప్రజల్లో ఎలా నిత్యం పార్టీ కోసం శ్రమించాడో అలాగే నాయకులు కూడా ప్రజల మధ్య ఉండాలని సూచించారు. అప్పుడే జగన్ సీఎం అవుతారని అన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: