నాడు నాయకులు – నేడు ప్రజలు

Kuthuru Raji Reddy
నేడు తెలంగాణ ఉద్యమం నాయకుల చేతుల్లో లేదు. ప్రజల చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణ ఉద్యమాన్ని నాయకులు వదిలిపెట్టినా కూడా ప్రజలు భుజాన వేసుకొని ముందుండి ఉద్యమాన్ని నడిపే పరిస్థిల్లో ఉన్నారు. అంతేకాదు నాయకులు ఉద్యమాన్ని నడిపి ఫలితం రాకుండా నాయకులు స్వప్రయోజనాల కోసం మద్యలో వదిలేస్తే ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు. ప్రజలవెంట నాయకులు పరుగులెత్తేకాలమిది. ఇటువంటి సెంట్ మెంటు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ముందుండి పోరాడుతున్నారు. ప్రజల వెంట నాయకులు నడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ రాదని సోనియాచెపితే తెలంగాణ చల్లారుతుందని కావూరి చల్లగా సెలవిచ్చారు. అంతేకాదు ఇందిరాగాంధీలా సోనియాగాంధీకూడా తెలంగాణ రాదని ఖచ్చితంగా చెప్పేస్తే తెలంగాణ ఉద్యమం దానంతటదే చల్లారి పోతుందని ఎంపీ కావూరి విశాఖ సదస్సలో అభిప్రాయపడి ఉండవచ్చుగాని నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితితులు వేరుగా ఉన్నాయి. ఇందిరాగాంధీ కాలంలో తెలంగాణ ఉద్యమం నాయకుల చేతుల్లో ఉంది. అప్పుడు అనేక మంది విద్యార్థులు నాయకులు చేసే ఉద్యమాన్ని విశ్వసించి తెలంగాణ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు. తుదకు నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలకోసం తెలంగాణకు ద్రోహం చేశారు. దీంతో నాటి ద్రోహం విషయాన్ని నేటికి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కాగా తెంలగాణ కోసం ఎంతోమంది ప్రాణాలర్పించిన ఇటువంటి సందర్బంలో ఏదో తమ ప్రయోజనాలకోసం కావూరి, లగడపాటి, శైలజనాథ్ లాంటి వేళ్లమీద లెక్కించే సీమాంధ్ర నాయకులు తెలంగాణకు రాకుండా అడ్డుకునేందుకు ఎంతగా ప్రయత్నించిన ఫలితం ఉండకపోవచ్చు. ఎందుకంటే అడ్డుకునే స్థాయి దాటిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే శరణ్యమనే భావన యావత్తు తెలంగాణ ప్రజల మదిలో కదలాడుతుంది. ఇటువంటి సందర్భంలో ప్రజలవెంట తెలంగాణ ప్రాంతంలోని అన్ని రాజకీయపార్టీల నాయకులు నడుస్తున్నారు. ఈపరిస్థితిలో కేంద్రం తెలంగాణ ఇవ్వడమే గత్యంతరంగా మిగిలింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సీమాంధ్ర ప్రాంత నాయకులు కేంద్రం వద్ద ఎంతగా లాబీయింగ్ చేసిన ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ఎవరైనా తెలంగాణ ప్రాంత నాయకులు మాట్లాడితే ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. అంతెందుకు తెలంగాణ కోసం 2009 లో తెలంగాణ కోసం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అమరణ నిరాహారదీక్షచేసిన సందర్బంగా దీక్షను భగ్నం చేసిన సర్కార్ కెసిఆర్ ను ఖమ్మ ఆసుపత్రికి తీసుకెళ్లిన సందర్బంలో కెసిఆర్ తో బలవంతగా పళ్లరసం త్రాగించడం కోసం ప్రయత్నించి దీక్షను విరమింపజేస్తామనే ప్రయత్నంలో విషయం తెలుసుకున్న తెలంగాణ విద్యార్థిలోకం తెలంగాణ వ్యాప్తంగా కెసిఆర్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇటువంటి పరిస్థితిలో దీక్ష కొనసాగించారు. దీంతో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రకటించి తర్వాత వెనుక్కి తీసుకుంది. దీంతో ఇకనుండి ఇటువంటి పరిణామాలు జరుగకుండా కేంద్రం త్వరలోనే తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: