ప్రేమ , పెళ్లి , కామం , రోమాన్స్ వీటి మీద కోర్సు .. భారీగా జాయిన్ అవుతున్న కుర్రాళ్ళు - అమ్మాయిలు
ఎర్ర జండాలు పట్టుకుని పోరాటాలు జరిపే నేల ఇప్పుడు ప్రేమ కావ్యాలు రాస్తోంది. కమ్యునిస్టుల దేశం అయిన చైనా ఇప్పుడు అమ్మాయిలని ఎలా పడెయ్యాలి, అబ్బాయిలతో అమ్మాయిలు ఎలా ప్రవర్తించాలి అంటూ రాసలీలను నేర్పుతోంది. పాలిటిక్స్ ని పక్కన పెట్టి పటాయించే కోర్సులు కొత్తగా యూనివర్సిటీ లో జేర్చడం విశేషం. ప్రొఫెసర్ లు కూడా ప్రేమ పాఠాలు బోధిస్తూ యూత్ కి ప్రేమ మత్తు ఎక్కిస్తున్నారు.
చైనా లోని తియాంజిన్ యూనివర్సిటీ లో థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ రొమాంటిక్ రిలేషన్ అనే కోర్సు ని పెట్టారు అందులో పికప్ టెక్నిక్లు తెలుగు లో చెప్పాలి అంటే పటాయించడం , సెల్ఫ్ ప్రెజెంటేషన్ , ఆపోజిట్ సెక్స్ ని ఆకట్టుకోవడం లాంటి అధ్యయనాలు బోలెడు ఉన్నాయి. దీంతో అంతకుముందు బాగా డ్రై సబ్జెక్టయిన కమ్యూనిస్టు భావజాలంపై పాఠాలు బోధించిన జీ షూ అనే ఓ ప్రొఫెసర్ కూడా ఇప్పుడు మాంచి మజా ఇచ్చే రొమాంటిక్ లెక్చర్లు ఇస్తున్నారట. ఇలాంటి పాఠాలు క్లాస్ రూమ్ లలో చెబితే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో కాంటీన్ లు - కెఫే లూ - పార్కులూ ఎంచుకుని మరీ ఇక్కడ ఈ లెర్నింగ్ స్కిల్స్ ని ఒక పట్టు పడుతున్నారు.
మామూలుగానే స్టూడెంట్ లని ఇప్పుడు ప్రేమ, మోజు, వ్యామోహం, కామం వీటిల్లో ఆపలేకుండా ఉన్నాం. తెల్లారిన దగ్గర నుంచీ ప్రతీ వ్యవహారం లో ఎదో ఒక రకంగా ఇబ్బందులు పడుతూ పెడుతూ వాటికి ప్రేమ అనే పేరు పెట్టి రెచ్చిపోతున్నారు యువత. ఇప్పుడు సరికొత్తగా రొమాంటిక్ కోర్సులు చదివితే ఇక వారిని ఆపగలమా అనేది పెద్ద ప్రశ్న. అడగకపోయినా అమ్మాయిలని పడేసే పనిలో బిజీ గా నిత్యం కనిపించే అబ్బాయిలు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి మరీ వీధుల మీదకి వదిలితే ఇక తిరుగు ఉంటుందా ? కాకపోతే ఈ సారి కాస్త ప్రొఫెషనల్ గా ప్రవర్తిస్తూ రోమోయో లాగా వేషాలు వెయ్యడం, గేలి చెయ్యడం, ఏడిపించడం మరీ ముఖ్యంగా యాసిడ్ లు పొయ్యడం లాంటివి చెయ్యడం మానేయచ్చు పూర్తిగా. ఒకరకమైన బెనిఫిట్ లు ఉన్నా అంతకంతా నేగెటివిటీ కూడా ఉంది. ఏదేమైనా ఇలాంటి కోర్సుల పట్ల యూత్ విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.