పైసాకే పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్.. !

Chakravarthi Kalyan
పైసాకే పది లక్షల రూపాయల బీమా.. ఔను మీరు చదివింది నిజమే.. ఏ మార్కెట్ మాయాజాలమో అంతకన్నా కాదు. కాకపోతే.. ఇది రైలు ప్రయాణికులకు మాత్రమే వర్తించే బీమా అన్నమాట. రైలు ప్రయాణికులందరికీ ఈ బీమా కల్పించాలని కేంద్రం యోచిస్తోంది.  

రైల్వే ప్రయాణికులందరికీ ప్రమాద బీమా కల్పించేందుకు దాదాపు 17 బీమా సంస్థలను వడపోసి.. చివరకు రాయల్‌ సుందరం, ICICI లాంబార్డ్‌, శ్రీరాం జనరల్‌  కంపెనీలను... ఎంపిక చేసింది. ప్రీమియం, ఇతర అంశాలపై సంప్రదింపులు తుదిదశలో ఉన్నాయని రైల్వేవర్గాలు తెలిపాయి.


సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి తొలుత రిజర్వేషన్  చేసుకున్న ప్రయాణికులకు ప్రమాద బీమా అమలు చేస్తామని వెల్లడించాయి. 10 లక్షల రూపాయల మేర ప్రమాద బీమాకోసం.. రిజర్వేషన్‌ చేసుకునే వారు టికెట్‌పై 5 రూపాయలు,..సాధారణ తరగతి ప్రయాణికులైతే  ఒక్కపైసా చెల్లించాలని  ప్రాథమికంగా.. ప్రతిపాదిందినట్లు తెలుస్తోంది.

పూర్తిస్థాయి విధివిధానాలు ప్రకటించేలోగా రిజర్వేషన్‌ ప్రయాణికుల ప్రీమియం కొంత తగ్గనున్నట్లు.. రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.రోజూ 2 కోట్ల 30 లక్షల మంది రైల్వేల్లో ప్రయాణిస్తుండగా.. ఎక్కువ మంది సాధారణ ప్రయాణాలే చేస్తుంటారని.. అంచనా వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: