తెలుగు ప్రాచీనహోదాకు దక్కిన గౌరవం..!

Edari Rama Krishna
తమిళేతర భాషలకు కేంద్రం ప్రాచీన హోదా కల్పించడంపై తాము జోక్యం చేసుకోబోమని మద్రాస్‌ హైకోర్టు వెల్లడించింది. నిబంధనల ప్రకారమే తెలుగుకి ప్రాచీన హోదా కల్పించినట్లు మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.  తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు సోమవారం విచారించింది. హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని స్పష్టం చేసింది.హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.

తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాది రవీంద్రనాథ్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక సంఘం సంచాలకుడు మామిడి హరికృష్ణ ధర్మాసనానికి వివరాలు సమర్పించారు.ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు, వాదనలు కోర్టును సంతృప్తి పరిచాయి.తర భాషలకు ప్రాచీన హోదా దక్కడంతో తమిళ భాషకు ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోతుందన్న పిటిషనర్‌ వాదనను కోర్టు కొట్టిపారేసింది.

ఇతర భాషల అభివృద్ధి లేదా పతనంపై ఒక భాష ప్రాముఖ్యత ఆధారపడి ఉండదని, కళలు, సాహిత్యానికి ఆ భాష అందించే సేవలపై అది ఆధారపడి ఉంటుందని వెల్లడించింది.పెద్దఎత్తున పోరాటం జరిగాక తెలుగుకి ప్రాచీన హోదా డిక్లర్ చేసారు. దీనిపై కోర్టుకు వెళ్లగా, ఇప్పుడు కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: