నకిలీ నోట్ల చెలామణిలో అసలు సూత్రదారులెవరో!?

Kuthuru Raji Reddy
గత కొంతకాలంగా నకలీ నోట్ల చెలామణి అవుతుండడంతో పోలీసులు ఈవిషయంపై దృష్టి సారించారు. కాగా ఇటీవల హైదరాబాద్ లో పలువురు దొంగనోట్లు చెలామణి చేసేవారిని అదుపులోకి తీసుకోగా, సిద్దిపేట కేంద్రంగా నకిలీ నోట్ల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇందులో ఒకరు అనారోగ్యంతో మృతిచెందగా ఈవిషయంపై పలుఅనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా పోలీసుల అదుపులో ఉన్నటువంటి మరొకరిని పోలీసులు విచారిస్తే ఎటువంటి సమాచారం రానుందోననే విషయం ఇందులో సంబంధంమున్నవారిని వేధిస్తున్నటువంటి ప్రశ్నలు. పోలీసులు అరెస్టు చేసిన సందర్బంలో ప్రింటర్ తో పాటు 25లక్షల రూపాయలు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి విఠల్, గంగారాంను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి నకిలీ నోట్లను స్వాదీనం చేసుకోగా ఇందులో విఠల్ అనారోగ్యంతో మరణించారు. కాగా రిమాండ్ లో ఉన్నటువంటి గంగారాంను పోలీసులు కస్టడిలోకి తీసుకొని విచారించేందుకు సిద్దంగా ఉండగా, ఇందులో ఎవరెవరికి ప్రమేయం ఉందనే విషయం స్పష్టమవుతుంది. సిద్దిపేట కేంద్రంగా ఇప్పటికే పలుమార్లు దొంగనోట్ల చెలామణిదారులు పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ఇంత మొత్తంలో నకిలీ నోట్లు దొరుకడంతో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడం, ఇందులో ఒకరు చనిపోవడం వంటి సంఘటనటు జరుగగా దొంగనోట్ల చెలామణిలో ఎంతో మంది దొరబాబులున్నట్లుగా తెలుస్తుంది. దొంగనోట్ల చెలామణి, ముద్రణ వంటి కార్యక్రమాలు కేవలం వీరిద్దరితో అయ్యే పనికాదనే కోణంలో దర్యాప్తు చేస్తే ఇందులో సూత్రదారులెవరో తెలిసిపోతుంది. కాగా పలుప్రాంతాల్లో దొంగనోట్ల చెలామణి అవుతుండగా ఇందులో ఎక్కడెక్కడి ప్రాంతం వారితో రిమాండ్ లో ఉన్నటువంటి గంగారాంతో సంబందాలున్నాయనే విషయాలు బయటకు రానున్నాయి. కాగా ఈవిషయంపై పోలీసులు దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: