అమరావతి భూ దురాక్రమణే : రామన్ మెగసేసే అవార్డీ గొపీనాథ్

రామన్ మెగసేసె అవార్డ్ గ్రహీత, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాధ్ ఒక ప్రముఖ పత్రిక కిచ్చిన ఇంటర్వ్యూ లో, ఒక గొప్ప రాజధాని నిర్మాణానికి సుమారు 1500 నుండి 4000 ఏకరాల భూమి సేకరిస్తే సరిపోతుందని, చత్తీసుగఢ్ రాజధానికి రాయపూర్ ను 2000 ఎకరాల్లో రాజధాని ప్రాంతం గా అభివృద్ధిపరుస్తున్నారు. రాజధానికి కావలసినంత భూమికంటే ఎక్కువ సేకరించినా సమీకరించినా పేపేరుతో దాన్ని పిలిచినా చివరకు నష్టపోయేది తొలుత పర్యావరణం, తరవాత రైతు సమాజం.  అంధ్రప్రదేశ్ అద్భుత రాజధాని 4000 ఎకరాల్లో నిర్మించొచ్చు. అలాంటి చోట 33000 ఎకరాలు సేకరించారు.


భూసేకరణలో ఆంధ్రప్రదేశ్ కు దూకుడు చాలా ఎక్కువని ఆయన అన్నారు. భూ సేకరణ విషయములో పర్యావరణానికి జరిగే ప్రమాదాన్ని, వ్యవసాయ భూములు అవి రెండుపంటలు పండేవా? మూడుపంటలు పండేవా అన్న మీమాంసకు తావులేకుండా జరిపేశారు. రాజధానికి కావలసిన భూమి కంటే ఎక్కువ భూ సేకరణలోని ఆంతర్యం వ్యాపార ప్రయోజనాలేనని, పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టి తమకు పరోక్ష లబ్ది చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం పారదర్శకతను పాతరేసిందని ప్రజలు ఘోషిస్తున్నారు. ఇంతటి దౌర్భగ్య పరిస్థితులు నియంతృత్వ రాజయాల్లో కూడా కానరావు. అందువల్ల అమరావతి భూ దురాక్రమణేకాని ఖచ్చితంగా  భూసేకరణ కాదు


అమరావతిలో జరిగిన భూసేకరణ ప్రభావం అక్కడ సామాజిక, ఆర్ధిక, పర్యావరణ, రాజకీయ రంగాలపై ప్రభావం చూపుతుంది. అంతే కాదు పేదల భూములు గుంజుకోవటంతో పేదలపై మరింత ప్రభావం చూపి తుదకు జీవన వ్యత్యాసాలేర్పడి ప్రజల్లో నేరస్వభావం పెరిగిపోయి భవిష్యత్ లో సామాజిక పరమైన ప్రమాదాల్లో చిక్కుకొనే పరిస్థితికి దారితీస్తుంది.


వ్యవసాయాధారిత రంగాలకు రైతులకు, రైతుకూలీలకు  మేలుచేయలంటే :

* వ్యవసాయ సంక్షోబాన్ని సమగ్రంగా చర్చించటానికి పార్లమెంట్ ను ప్రత్యేకించి సమావేశ పరచాలని

  • స్వామినాథన్ కమీషన్ పై చర్చించాలని వ్యవసాయాన్ని ప్రజా సేవా రంగం గా గుర్తించాలని తద్వారా రైతుకు కనీస ఆదాయం లభిస్తుందన్నారు.


ప్రొఫెసర్: స్వామినాథన్ కమీషన్


భూ రికార్డులతో సంభందం లేకుండా కౌలి దారులకి ఋణ సౌకర్యం కలిపించే ఉద్ధేశం తో 2011 లో ఒక చట్టం చేసినప్పటికీ అది రైతులకు ఆశించన ప్రయోజనాలను ఇవ్వలేదనీ చెప్పారు.


లక్షలాదిమంది కౌలు దారులున్న తెలంగాణా అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఋణాలను అందించటానికి విదుదల చేసిన కార్డులు ముఖ్యంగా ఆంధ్ర లో 5% అందాయని దీనివల్ల ఒనగూడిన ప్రయోజన మేమీలేదన్నారు. ఇక పంటల భీమా రంగానికి వస్తే ప్రభుత్వ భీమా సంస్థల ప్రమేయం దాదాపు శూన్యమని, ప్రయివేటు భీమా సంస్థలవల్ల దోపిడీ తప్ప రైతులకు ప్రయోజనం లేదని ఇంకా దుస్థితికి చేరటం తప్ప మరేదీ కాదని తెలుపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులకు చెందిన భీమా సొమ్ము 1000 కోట్లు ఎల్.ఐ.సి వద్ద మూలుగుతుందనీ, మూడు వాయిదాల ప్రీమియం చెల్లించిన తరవాత క్లయిం మొత్తం వారి కివ్వాలని అలాచేయకుండా వారి ఖాతాలను మూసివేసారని ఈ విషయాన్ని పార్లమెంటికు నివేదించినట్టు తెలిపారు.


రూరలిండియాఅన్లైన్.ఆర్గ్ లో గ్రామీణ భారతమును పూర్తిగా రికార్డ్ చేస్తున్నట్లు, రైతు ఆత్మహత్యలు, కమ్మరి, కుమ్మరి, జాలరి, మగ్గం మొదలైన రైతు కార్మికుల మరియు రైతుల ఆత్మహత్యలు కూడా అందులో పొందుపరచినట్లు తెలిపారు. వ్యవసాయదారుల ముఖకవళికలను కూడా రికార్డు చెశామని తెలిపారు.  దురదృష్టమేమంటే మీడియా సంస్థలు కుదా ప్రయోజనాలు పొంది - సరైన నిజమైన వార్తలు రాకుండా చూస్తున్నారు...ఉదాహరణకు విదర్భలో 43 పవర్ ప్లాంట్లకు పర్మిషన్ ఇస్తే అందులో ఐదు మీడియా సంస్థల వారికే దక్కాయి. వాళ్ళికేం వార్తలు రాస్తారు.


పై విషయాలని అవలోకించి పరిశీలిస్తే  ఈ సేకరణలో మన ప్రజా ప్రతినిధులు ఎన్నో దుర్మార్గాలు దౌర్జన్యాలు చెసారు వారి వారి బినామీల ద్వారా. అసలు వ్యాపారవేత్తలు, బడా భూస్వాములు వారి భూములు భూసేకరణలో అంతగా పోలేదనీ చిన్న చిన్న కమతాల వారివే సేకరణ జరిపిన భూముల్లో ఎక్కువని సమాచారం. అధికార వర్గాల వారి భూసంపద అంతా రాజధాని కేంద్రానికి అతిచేరువలో ఉండేలా ప్లాన్ ప్రకారం భూసేకరణకు ముందే కొనగోళ్ళు చేసారని ప్రచారములో ఉంది. నిజంగా కేంద్రం దేశ రైతు ప్రయొజనాల పరిరక్షణను ఆశిస్తే ఈ అమరవతి కి చెందిన అన్నీ విషయాలపై సమగ్ర విచారణ జరిపిస్తే తప్ప  “అమరావతి రాజధాని రహస్యం”  వెలికి రాదు.


చత్తీస్-గడ్ రాజధాని రాయపూర్


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: