డిప్యూటీ హోం మినిస్టర్ ను అపహరించి హత్యచేశారు

గని కార్మికులు తమకు ఎంతోకాలంగా పెండింగులో పెట్టిన డిమాండ్లు నెరవేర్చలేదని డిప్యూటీ (హోం)  మినిస్టర్ ను కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హతమార్చిన ఘటన బొలీవియాలో చోటు చేసుకుంది. ప్రైవేటు కంపేనీలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని, అధిక రాయితీలు, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని గత కొంత కాలంగా గని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

రొడాల్ఫ్ ఇల్లెన్స్


ఆందోళనలతో అట్టుడికి  పోతున్న ఆందోళనకారులున్న ఆ దారి గుండా వెళుతున్న  డెప్యూటి (హోం) మినిస్టర్ "రొడాల్ఫ్ ఇల్లెన్స్" ను  చుట్టు ముట్టిన కార్మికులు ఆయనను అపహరించి ఆయన సెక్యూరిటీని అడ్డగించి ఎత్తుకుపోయి అతి ధారుణంగా కొట్టి చంపినట్లు బొలీవియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

బొలీవియా ప్రభుత్వ ప్రతినిధి మంత్రి "కార్లోస్ రొమేరో"  ఇది కిరాతక చర్యగా అభివర్ణించారు. డిప్యూటీ మినిస్టర్ మృతదేహాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా ఆయన  ఆందోళన కారులను హెచ్చరించారు. గత కొంత కాలంగా బొలీవియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గని కార్మికులు ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. దీంతో ఇద్దరు ఆందోళనకారులను  పోలీసులు హతమార్చారు.

హైవేలపై దర్నాలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వమునుండి సరైన స్పందన లభించని కార్మికులు సహనం నశించి మంగళవారం నుండి పెద్దయెత్తున ఆందోళనలను మొదలు పెట్టారని తుదకు ఈ దుస్సాహసానికి వడిగట్టారని అభిజ్ఞవర్గాల కథనం. ఇందుమూలంగా చెలరేగిన అల్లర్లలో వందమందిని పైగా అరష్టు చేసినట్లు పొలీసు ఘర్షణ తో ఇద్దరు గని  కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: