తెలుగు ఇండస్ట్రీలో మహానటులుగా కీర్తింపబడిన నందమూరి తారక రామారావు కేవలవం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించాలని తెగుదేశం పార్టీ స్థాపించి అప్పటి వరకు కాంగ్రెస్ ఆదిపత్యానికి చరమగీతం పాడారు.
ఒకప్పుడు పల్లెటూరిలో రాజకీయాలంటే ఏంటో తెలియిన పరిస్థితిలో ఉండేది..కానీ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత ప్రతి పల్లెల్లో తెలుగు దేశం జెండా పాతారు..రాజకీయాలపై చర్చలు జరిపారు. అంతే కాదు ఎన్నో సంస్కరణలు చేపట్టారు..రైతుల కష్టాలు తీర్చారు.
ముఖ్యమంత్రిగా ఎన్నో కొత్త పథకాలు తీసుకు వచ్చి ప్రజల్లో గుండెల్లో పదిలంగా నిలిచిపోయారు. ఇక తమిళనాడులో సామాన్యమైన రంగస్థల నటుడిగా సినిమాలో ఎంట్రీ ఇచ్చి మహానటుడిగా ఎదిగారు ఎంజీఆర్.
1977 నుంచి ఆయన చనిపోయేంత వరకు ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగారు. తమిళనాట ఎంజీఆర్ అంటే ఇప్పటికీ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఈ ఇద్దరు మహానటులు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మంచి స్నేహితులు.