బాంబ్ బ్లాస్ట్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య

Devi Priya
హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండు ఎదుట సంభవించిన బాంబు పేలుళ్ల సంఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సుమారు 17 పైగానే మృతుల సంఖ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, మరణాల గురించి ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. గాయపడ్డ వారిని ఉస్మానియాకు 15 మందిని తరలించారు. 12 మందిని యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఓమిని, యశోధ ఆసుపత్రులకు తరలించారు. దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో ఫోన్లు పనిచేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం హైఅలర్డ్‌ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక చోట్ల బాంబు పేలుడు జరిగాయి. పెద్దఎత్తున పోలీసులు బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఘటనా స్థలికి బయలుదేరారు. కోణార్క్ థియేటర్ వద్ద ఓ హీరోహోండా బైక్‌లో బాంబు పేలినట్లు వార్తలు వస్తున్నాయి. సిసి కెమెరాల ద్వారా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాంబు పేలుళ్లుగానే చెబుతున్నారు. ప్రధాన నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పేలుళ్లపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా పేలుళ్ల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నగరంలో హైఅలర్ట్, పోలీసుల తనిఖీలు వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అనుమానస్పదంగా వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్క్షప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: