ఔనూ! మా ఏయిర్పోట్ల సంగతేంది:కవిత

 హైదరాబాద్: తెలంగాణలో ఏయిర్పోట్ల అభివ్రుద్ధిపై ప్రత్యేక ద్రుష్టిని మళ్లించాల్సిందిగా తెలంగాణ రాష్ర్ట జాగ్రుతి అధ్యక్షురాలు కవిత రాష్ర్ట విమానాశ్రాయభివ్రుద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాస్ రావును కోరారు. ఆమె ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ రావును కలిశారు. తెలంగాణలోని అదిలాబాద్, వరంగల్ ఏయిర్పోట్లను అభివ్రుద్ధి చేయాలన్నారు. ఈ ప్రాంత ఏయిర్పోట్ల సంగతి తేల్చాకనే సీమాంధ్ర ఏయిర్పోట్ల ముచ్చట చూడాల్సిందిగా కవిత రాష్ర్ట మంత్రి గంటా శ్రీనివాస్ రావుకు విన్నవించారు. సీమాంధ్రలో ఉన్న ఏయిర్పోట్లన్నింటినీ అక్కడి పాలకులు అభివ్రుద్ది పర్చుకుంటున్నారనీ, తెలంగాణ ప్రాంతానికి వచ్చే సరికి నిర్లక్ష్య ధోరణి, పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారనీ కవిత ఆరోపించారు. రాయలసీమలో రెండు ఏయిర్పోట్ల పనులు చురుగ్గా సాగుతున్నా తమ ప్రాంత ఏయిర్ పోర్టు గురించి పట్టించుకోకపోవడాన్ని ఆమె ఖండించారు. తెలంగాణ ఏయిర్పోట్లపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా బేగంపేట ఏయిర్ పోర్టును దేశీయ విమానాలు తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలనీ కవిత డిమాండు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: