జాతీయ స్థాయిలో ఇక కాంగ్రెస్ పార్టీకి చివరి రోజులేనా..?

malleswarareddy
రాహుల్ గాంధీని ప్రధానిమంత్రిని చేసినా, ఇంకే పదవి ఇచ్చినా దేశానికి ఒరిగేది ఏమీ ఉండదు. మునిగి పోతున్న కాంగ్రెస్ పార్టీని ఎవ్వరొచ్చినా కాపాడలేదన్నది నగ్నసత్యం. జవహర్ లాల్ నెహ్రు దగ్గర నుంచి నేటి సోనియా గాంధీ వరకూ (మన్మోహన్ వరకూ) దాదాపు 50 సంవత్సరాలు యదేచ్ఛగా పరిపాలన సాగించి అవినీతిని, మాఫియాని, ఏర్పాటువాదాన్ని, మతతత్వాన్ని, కులతత్వాన్ని, నిరుద్యోగాన్ని, హర్షద్ మెహెతా, దావుద్ ఇబ్రహిం వంటి వాళ్ళని ఎంతో మందిని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయే. లక్షల కోట్ల రూపాయలు నల్లధనం ఇతర దేశాల్లో ఉండటానికి సహకరించింది, భారత దేశం నుంచి నల్ల ధనాన్ని దాచుకున్న వారిని కాపాడేది కాంగ్రెస్ పార్టీయే. 50 సంవత్సరాలలో ధనవంతున్ని అతి ధనవంతున్ని, బీదవాన్ని అతి బీదవాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీయే. విద్యుత్ సంక్షోభానికి, రైతులు ఆత్మహత్యలకు, ఏర్పాటు వేదానికి, తీవ్రవాదానికి, ఐఎస్ఐ అకృత్యాలకు.. ఇలా అన్నింటికి కాంగ్రెస్ పార్టీయే పూర్తి బాధ్యత వహించాలి. గ్రామాలకు అధికారాలు ఇవ్వకుండా, ఆర్థిక శక్తి పెరగటానికి దోహదపడకుండా గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీయే. అణువు అణువునా అవినీతిని పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీయే. ప్రపంచంలో సోషలిస్టు దేశాలు ఎన్నో వుండగా వారిని అనుసరించకుండా, పెట్టుబడి, సామ్రాజ్యవాద దేశాలకు అనుగుణంగా ఉండి దేశ సార్వభౌమత్వాన్ని ప్రమాదకరంగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీయే. తరతరాల నుండి భారత దేశంలో ఉన్న మంచి సంస్కృతి సంప్రదాయాలను భ్రష్టు పట్టించి, దేవాలయాలకు ఉన్న ఆస్థులను కాపాడలేకపోయింది. దేశ జనాభాలో 70 శాతం వ్యవసాయం మీద జీవనధారం సాగిస్తుంటే వారి అభివృద్ధికి కృషి చేసింది ఏమీ లేదు. మార్కెట్లో సరుకులకు రేట్లు విపరీతంగా పెంచింది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతాంగాన్ని బిచ్చగాళ్లుగా, ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీయే. విద్యను గుత్తేదార్లకు అప్పజెప్పి కోట్లాది రూపాయిలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద గుంజి వారిని పూర్తిగా అప్పుల ఊబిలోకి లాగిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. లక్షలాది మందిని నిరుద్యోగులుగా తయారు చేసి ఈ దేశాన్ని దరిద్ర దేశంగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీయే. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్, దేవగౌడ, ఐ.కె.గుజ్రాల్, వాజ్ పాయ్ వంటి వారు మొత్తంగా సుమారు 13 సంవత్సరాలు కూడా పరిపాలించలేదు. వీరు సుపరిపాలన, సమర్థ పరిపాలన అందించే సామర్థత ఉన్నా కాంగ్రెస్ పార్టీ అర్థబలంతో, అంగబలంతో పరిపాలన సాగనివ్వకుండా పాపం కట్టుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీయే. మొత్తం పాపంలో నూటికి నూరుశాతం కాంగ్రెస్ పార్టీదే. జాగీర్దార్లకు సంస్థానాదీశుయుల, భూస్వాముల ఆకృత్యాయలకు, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కమ్యునిస్టులు తెలంగాణ రైతాంగా సాయుధపోరాటాన్ని నడుపుతుంటే భూమిలేని వారికి భూమి కోసం భుక్తి కోసం పోరు సలుపుతున్న కమ్యూనిస్టులకు సహకరించకుండా ఐదు వేల మంది కమ్యూనిస్టులను నిర్ధాక్ష్యనయంగా చంపించింది నెహ్రు కాంగ్రెస్ ప్రభుత్వమే. అనేక మందిని ఆర్థికంగా, శారీరకంగా పాశవికంగా ప్రజలను చిత్రహింసలు పెట్టింది ఈ పార్టియే. భారత దేశంలో కమ్యునిస్టు ప్రాబల్యం పెరగకుండా పెట్టుబడి, సామ్రాజ్య వాద దేశాల సహకారంతో భారతదేశంలో కమ్యునిస్టులను అణచివేసిన పాపం కాంగ్రెస్దే. భూస్వాములకు జాగీర్ దారులకు అండగా నిలిచి వారిని రాజకీయంగా అర్థికంగా వేలకోట్ల రూపాయలు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ఉపయోగపడ్డది, వాళ్లను పెంచిపోషించింది ఈ పార్టీయే. భారతతదేశాన్ని అన్ని విధాల నూటికి నూరుశాతం దివాళాతీయించింది ఈ ప్రభుత్వమే. ఇక ఈ పార్టీ ఆటలు సాగవ్ జనం చైతన్యవంతులయ్యారు. అందుకే రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లో, బీహర్లో గల్లి గల్లీలో తిరిగినా కాంగ్రెస్ కు ఉన్న అంతో, ఇంతో ఉనికిని పూర్తిగా కోల్పొయింది. ఎదో ఒక పార్టీగాని, కూటమి గాని అవతరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే అంతమవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వారికి చివరి రోజులు. అన్నా హాజారే వంటి వ్యక్తుల అధ్వర్యంలో మంచి పరిపాలన అందించే ప్రభుత్వం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: