బతుకలేని రైతు

Kuthuru RajiReddy
వర్షాకాలం సగం ముగిసింది.. బలమైన కార్తెలు వెళ్లిపోతున్నాయి.. చెరువులు,కుంటల్లో కి నీరు చేరలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురియగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాపాతం నమోదుకాలేదు. కేవలం రైతులు వర్షాధార పంటలైన మొక్కజొన్న, వేరుశనగ, పత్తి వంటి పంటలను సాగుచేశారు. తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు తగిన వర్షాలు కురియలేదు. ఈసారి వర్షాలు కురిసి బావులు, చెరువుల్లోకి నీరు చేరుతుందని తద్వారా వరిపంటను సాగు చేస్తామనుకున్న రైతుల వారం రోజుల క్రితం కురిసిన కొద్ది పాటి వర్షాలకు ఆశలు చిగురించి వరినారు పోశారు. కాగా తర్వాత నుండి నారుకు సరిపడే నీరులేక పోవడంతో వరినార్లు ఎండిపోతున్నాయి. వర్షాకాల సీజను సగం అయిపోయినప్పటికిని వర్షాలు కురియక పోవడంతో ఈసారి కూడా రైతులు వరి పంట సాగుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు మాసంలో నైనా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు పెరుగుతాయని తెలంగాణలోని కొన్ని ప్రాంతాల రైతులు ఎదురు చూస్తున్నారు. వారం రోజుల నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు విరివిగా కురుస్తున్నప్పటికిని మెదక్ జిల్లాలోని కొన్ని మండలాల్లో వర్షాలు తక్కువగా కురియగా నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. అదే విధంగా అనంతపూర్, విశాఖ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో తక్కువగా వర్షాపాతం నమోదైంది. కాగా వర్షాపాతం తక్కువగా నమోదైన ప్రాంతాల్లో వరిపంట సాగు తగ్గిపోయే అవకాశముంది. కాగా ఖరీఫ్ లో వేసిన ఆరుతడి పంటల పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. వేలాది రూపాయలు వెచ్చించి ఆరుతడి పంటలను సాగుచేసిన రైతులకు వరుణుడు కరుణిస్తే పంటలు పండినట్లవుతుంది లేదంటే ఎండినట్లవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: