లారీల పంచాయతీ

Kuthuru RajiReddy
తెలంగాణ ప్రాంతానికి చెందిన లారీలను ఆంధ్ర ప్రాంతంలోని తాడిపల్లిగూడెం వద్ద అక్కడి ప్రాంత నాయకులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ అందుకు నిరసనగా తెలంగాణ ప్రాంతంలోని సిద్దిపేట రంగధాంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రాంతానికి చెందిన వాహనాలను నిలిపివేస్తూ రోడ్డుపై ధర్నా చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 40లారీలను ఆంధ్రప్రాంతంలో నిలిపివేశారని, వాటిని వెంటనే విడిచిపెట్టాలని టిఆర్ఎస్ నాయకులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రంగదాంపల్లివద్ద మాట్లాడుతూ డిమాండ్ చేశారు. అదే విధంగా లారీలనే తక్షనమే విడిచి పెట్టకుంటే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రాంతానికి చెందిన వాహనాలను తిరుగనివ్వమని హెచ్చరించారు. అదే విధంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పర్కాల ఎమ్మెల్యే బిక్షపతిగౌడ్ తదితరులు రాజీవ్ రహదారిపై రెండుగంటలపాటు ఆందోళన చేశారు. కాగా లారీలను పట్టుకున్న పంచాయతీ ఎంత వరకు దారితీస్తుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ప్రాంతాల మద్యన ఎటువంటి సమస్య జరిగిన అది వేడెక్కుతుంది. ఫలితంగా రెండు ప్రాంతాల మద్యన వైరుద్యాలు మరింతగా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: