పవన్ కళ్యాన్ మహేష్ బాబులకు మైండుకు చెదలు పట్టాయా?


ఒక సంసారం పాతపడినా కొద్దీ ఇంట్లో పనికి రాని సామానులు పేరుకు పోతుంటుంది. ఒక కంప్యూటర్ వాడినా కొద్దీ దాన్లోని టెంప్ ఫైల్స్ పెరిగిపోతాయి. ఒక వాహనం వాడినా కొద్ది అరుగుదలతో దాని విడిభాగాలు పటుత్వం కోల్పోయి వాహన ఉపయోగం దెబ్బతింటుంది. మొదటి దాంట్లో పాత పనికి రాని సామాన్లను తొలగించటం, రెండోదాంట్లో టెంప్ ఫైల్స్ డిలీట్ చేయటం మూడో దాంట్లో పనికి రాని భాగాలు తీసివేసి రిపేర్ చేయటం జరుగు తుంది.


అలాగే సంస్కృతి సాంప్రదాయం కూడా!  శత సహస్ర శతాబ్ధాల నుండి భారతీయ సంస్కృతి వర్దిల్లుతుంది. సందర్భాన్ని బట్టి కొన్ని అవసరాల కోసమో కాల క్రమేణా కొన్ని అనాచారాలూ మనకు దాపురిస్తాయి. కొన్నాళ్ళకు అవి మన సాంప్రదాయాల్లో భాగమై పోయి ఎందుకు అనుసరిస్తున్నామో తెలియని వివరించలేని దౌర్భాగ్యం దాపురిస్తుంది. వాటివల్ల కొన్ని సార్లు ఉపయోగాలు లేకపోయినా అనర్ధాలు జరగవచ్చు.



అలాగే సాంప్రదాయం గురించిన కథ:

ఒకానొక కాలములో ఒక సంతానం లేని బ్రాహ్మణుడు ఒక పిల్లిని అల్లారుముద్దుగా పెంచేవాడు. ఆ పిల్లి కూడా పసి పిల్లాడులాగా గారాలు పోతూ ఆ విప్రుని కుటుంబంలో ఒక భాగమైంది. ఎంతలా అంటే సంధ్యావందనం చేసుకొనే సమయంలో దీని అల్లరి భరించలేక ఆ పిల్లిని బుట్ట కింద పెట్టి తన అనుష్కామ కర్మలు చేసుకునే వారు.

తరవాత ఒకటి రెండు సంవత్సరాలకు  విప్రునికి సంతానం కలగటం వారా బాలుడు కూడా ఊపనయన సంస్కారాలు చేసి తండ్రి లాగానే సంధ్యా వందనం చేయటం ఆ సమయములో ఆ పిల్లి పిల్లని బుట్ట కింద పెట్టటం చేసే వారు. చివరికి ఆ బాలుడు పెరిగి పెద్దవాడు కావటం ఈ మద్య లో ఆ విప్రుడు దేశాంతరం వెళ్ళగా పిల్లి చనిపోతుంది. ఈ విప్ర బాలుడు మరో పిల్లిని తెచ్చి బుట్ట కింద పెట్టి సంధ్యావందనం చేయటం జరుగుతుంది. “సంద్యావందనం చేయాలంటే వారింట్లో పిల్లిని బుట్ట కింద పెట్టేసే ఆచారం ఏర్పడింది” దీనికి ఆ యుక్తవయస్కుడైన బాలునికి కారణం అవసరం లేదు. ఆచారం అంతే. ఇది తరవాత ఆ ఇంట అనాచారంగా కొనసాగుతునే ఉంది. ఈ అనాచారాన్ని కొన సాగించనవసరం లేదు. దీని వదిలించుకుంటే ఆ కుటుంబానికి ఒక చీడ వదులుతుంది. 


 


అలాగే మరో ఉదాహరణగా మానవ పరిణామ క్రమంలో జరిగిన విశేషం వివరిస్తా:

నాలుగు కాళ్ళ మేక, కోతి లాంటి జంతువులు పచ్చిగడ్డి చెట్ల ఆకులు తింటాయి (మేస్తాయి), ఈ ఆకుల్లోని సతతహరితాన్ని (క్లోరోఫిల్) జీర్ణం చేసుకోవటానికి దాని శరీరంలో "అపెండిక్స్" అనే దేహ భాగం ఉపయోగపడుతుంది. కాలక్రమేణా మానవ పరిణామ క్రమలో జంతువు నుండి మనిషి అభివృద్ది చెందాడు. అప్పుడు (ఇప్పుడు కూడా) జంతువులోని ఉపయోగపడే  “అప్పెండిక్స్”  మనకు “అవశేషాంగం” గా మిగిలిపోయింది. ఎందుకంటే మనం క్లోరోఫిల్  ఉన్న ఆకులు అలాలు తినం కాబట్టి.  అందువల్ల మన దేహంలో ఉన్న అప్పెండిక్స్ కు పనిలేదు. దాన్ని తీసివేస్తే మనకు వచ్చే నష్టమేమీ లేదు.

కాని పొరపాటున చిన్న ప్రేగు చివరన ఉన్న దీంట్లోకి ఆహార కణం పోతే దాని వల్ల ఇంఫెక్షన్ వస్తే దాని వెంటనే శస్త్ర చికిత్స చేసి తీసి వేయాలి.  లేకుంటే ఇంఫెక్షన్ డైజెస్టివ్ సిష్ఠం నే కాకుండా దేహాన్నంతా ఇంఫెక్షన్ పాలు చేసి సరైన సమయంలో సరైన శస్త్రచికిత్స చేయించుకోక పోతే చివరకు మరణం దశకు తీసుకెళుతుంది. దీన్నే అప్పెండిసైటిస్ అంటారు మెడికల్ పరిభాషలో.

మొదటి అనాచారం వదిలించుకోకపోతే ఆ విప్రుని కుటుంబములోకి వచ్చే కొత్త కోడళ్ళకు చిరాకు. తద్వారా అత్తమామల కుటుంబం పై చులకన భావం ఏర్పడుతుంది. రెండవ దాంట్లో అనవసరమైన వాటిని తొలగించితే కావలసినంత ఆరోగ్యం. ఇంట నిరుపయోగమైన వస్తుసామాగ్రిని తొలగిస్తే ఇంట్లో కావలసినంత జాగా, ఆరోగ్యం లభిస్తాయి. అలాంటివే సాంప్రదాయా లు, ఆచారాలు, సంస్కృతులు కూడా. వీటికి సంస్కరణలు అవసరం. 



ఈ సోది అంతా ఎందుకంటారా! చదవండి:

జనాల భావోద్వేగాలకు అనుగుణంగా మాట్లాడితే చాలనే విషయాన్ని రాజకీయనాయకులు సినిమా లాంటి వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళవాళ్ళ ప్రయోజనాలకు, వ్యాపారాలకు అనుకూలంగా బ్రతకాలని  - వీళ్లంతా గ్రహించేశారు! అందులో మంచి ఉందా? చెడు ఉందా? చేటు చేస్తుందా? చాటు ఉందా? అనే విషయాల గురించి ఆలోచించనక్కర్లేదు. కేవలం గుంపులో గోవిందయ్యలా ఒక మాట అనేయాలి. తమిళ సినీస్టార్లు ఈవ్యూహాత్మక ఎత్తుగడను అనుసరించి  “జల్లికట్టు”  గురించి  మద్దతుగా  మాట్లాడుతు న్నారు.


సంస్కృతి, సంప్రదాయం, అచారం  అంటూ వీళ్లు అతి చేస్తున్నారు. అరవవాళ్ళది అంతా అతి. వ్యక్తి పూజకు కుల మతాలకు వ్యతి రేఖంగా వెలసిన ద్రవిడ పార్టీలన్ని వాటికి అనుకూలంగా మారిపోయాయి. అందుకే అరవాళ్ళని అతిగాళ్ళని అంటాం. "ఊరంతా ఒక దారైతే ఉలిపిరికట్టెది ఒకదారి"  దేశమంతా ఒకే విధంగా ఆలోచిస్తే అరవాళ్ళు మరో  విధంగా ఆలోచిస్తారు.   అందుకే వాళ్ళు తెలివైన వాళ్ళైనా వ్యాపారాలకోసమో బ్రతుకుదెరువు కోసమో అలా చేసారనుకుందాం!


మనోళ్లకు ఏమైందో అర్థం కావడం లేదు. అరవంలో వీళ్ల సినిమాలు ఆడాలని అనుకుంటున్నారో ఏమో కానీ! మహే ష్ బాబు, పవన్ కల్యాణ్ లు “  అరవ అతిని "నిస్సిగ్గు” గా చేసేస్తున్నారు. ఇది నిస్సందేహం గా సిగ్గు చేటు.  జల్లికట్టుకు అనుకూలంగా వీళ్లు ఎన్ని లాజిక్కులు అయినా చెప్పవచ్చు గాక, కేవలం జనాల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవటం - చేసుకునే ప్రయత్నాలే కానీ ఈ సిగ్గు చేటు ప్రయత్నాలకు మరో భాష్యం చెప్పలేం.


పవన్ కల్యాణ్ జల్లికట్టును సమర్థించేశారు. పవన్ అభిమానులు "అపర అరవ  సంప్రదాయవాదులు"  గా మారిపోవచ్చు ఇప్పటి కిప్పుడు.  ఇక మహేష్ మద్దతిచ్చాడని, ఆయన  ఫ్యాన్సూ  రెచ్చిపోవచ్చు.  "జల్లి కట్టు ప్రాశస్తి"  గురించి వీళ్లు వివరించుకు రావొచ్చు! అదెంత గొప్ప సంప్రదాయమో వీళ్లు పూస గుచ్చి  చెప్పుకురావొచ్చు!

అయినా! జల్లికట్టు మాత్రమేనా మన సంప్రదాయం? అలాంటి వెన్నో కాల క్రమేణా మానవ సమాజం వదిలించుకుంది. అలా వదిలించుకున్నవే:

సతీ సహగమనం,

బాల్య వివాహాలు,

వృద్ధలకు (పసి బాలికలతో)  వివాహాలు  

వరకట్నం

కన్యాశుల్కం

జంతు బలులు

బహు భార్యాత్వం

వ్యభిచారం

దేవదాసీ వ్యవస్థ

కూడా మన సంప్రదాయాలే! శతాబ్దాల పాటు కొనసాగినవే, వాటన్నింటిని ఎందుకు వదిలించు కున్నాం? వాటిని ఎందుకు నిషేధించుకున్నాం?

 

“మీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారురా!, ఎద్దులను హింసిస్తూ, మిమ్మల్ని మీరు హింసించుకొంటూ, మీ కుటుంబాన్ని, మీ పెళ్లాం పిల్లలను అనాథలుగా చేస్తున్నారు, వద్దు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, అనే ఆలోచన తోనే జల్లికట్టును నిషేధించారు”  కానీ, అంతకు మించిన దురుద్దేశం ఏమైనా కనిపిస్తోందా?



ఇవన్నీ వద్దు, ఇప్పుడు జల్లికట్టు కు ఇంతగా మద్దతు పలుకుతున్న ఈ సినీ నటులు, సూపర్ - పవర్ స్టార్లు ఎంతమంది  ఆ క్రీడను ఆడుతున్నారు? ఎంతమంది హీరోలు, హీరోయిన్లు జల్లికట్టు వేడుకల్లో పాలుపంచు కుంటున్నారు? ఎంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు? ఎవరో అనామకులు, మూర్ఖులు చస్తున్నారు కదా! వీళ్లకు పోయేదేముంది?



సంప్రదాయాన్ని కాపాడటం అంటే, జల్లికట్టుకు మద్దతు పలకడం కాదు, దమ్మూ ధైర్యం ఉంటే వెళ్లి ఎద్దులతో తలపడాలి. అప్పుడే సంప్రదాయాన్ని కాపాడినట్టు కదా! జల్లికట్టుపై నిషేధం వద్దని మొత్తు కుంటున్న పవన్ కల్యాణ్, మహేశ్ బాబులు వెళ్లి ఎద్దులతో తన్నులు తింటే, అప్పుడు సంప్రదాయా న్ని కాపాడినట్టు. కాదనగలరా!  అయినా ఈ వేస్టుఫెలోస్ సంఘసంస్కర్తలు కావటానికి ప్రయత్ని0చి మంచి పేరు తెచ్చుకోవాలి గాని దుమ్మును, దరిద్రాన్ని పోగేసుకుంటున్నారేంటి?



ఆఫ్ట్రాల్ వీళ్ళకి "త్రిష" మాత్రం జ్ఞానం లేదు. ఆ అమ్మాయి తొలుత జల్లికట్టును వ్యతిరేఖించింది. సోషల్ మీడియా అటాక్స్ కు భయపడి మరల మద్దతు పలికింది. పవన్ కళ్యాణ్ "మైండు కు చెదలు" పట్టి ఉంటాయి. "చెగువెరా" అభిమానంటే నేను చాలా ఊహించాను. ఇంత చెత్త పర్సనాలిటి అనుకోలేదు.



ఆయన సంఘ సంస్కరణాభిలాషి కానప్పుడు రాజకీయాల్లోకి రాకూడదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ముందు వీళ్ళంతా “కుక్కమూతి పిందెలే”  ఎన్ని సంస్కరణలు తెచ్చారో ఆయన? వీళ్ళెందుకు తగలెట్టనా?  ఇప్పటికే ఓట్ల కోసం ప్రజలకు ఇష్ఠమైన (అంటూ) పనిచేసే రాజకీయ నాయకులు కోకొల్లలున్నారు. సంఘప్రయోజనాలను సాధించే పట్టుదల ఉన్న నాయకులు కావాలి. ప్రవాహం తో కొట్టుకుపోయే ఉలిపిరి కట్టెలెందుకు కాల్చనా?  సుదూర స్వాప్ని కులు కావాలి గాని ఈ సాధారణ రాజకీయ తంబ దేశానికే అవసరం లేదు.   వీళ్ళు రాజకీయాల్లోనికి రానవసరం లేదు. పైగా ద్రవిడ సంస్కృతి, సమగ్రతను కేంద్రప్రభుత్వం దెబ్బతీస్తుందని పవన్‌కళ్యాణ్ అన్నారు. ద్రవిడ సంస్కృతిపై దాడి విషయంలో ఒక ఉద్యమం చేస్తే సరి. కేంద్రం దిగివస్తుంది. అక్కడదాకా ఎందుకు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణాలో ఎన్ని సమస్యలు లేదు. 



కమల్, రజనీ, పవన్, మహేశ్.... ఈ సినీ మందను చూస్తుంటే, ఒకటే అనిపిస్తోంది. బ్రిటీషోళ్లు గనుక సతీసహగమనం వంటి వాటిపై ఆ రోజుల్లోనే నిషేధం విధించి వెళ్లి ఉండకపోయుంటే, నిషేధించి ప్రజలను క్రమంగా ఆ సంప్రదాయం నుంచి దూరం చేయకపోయి ఉండకపోతే. ఇప్పటికీ ఆడవాళ్లను బతికి ఉండగానే చితిమీద పెట్టి కాల్చడం సంస్కృతికి గర్వకారణం గానే కొనసాగుతూ ఉండేది. దాన్ని నిషేధించాలని ప్రభుత్వాలు ప్రయత్నించి ఉంటే, ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడే వాళ్లు వీళ్లంతా! కొందరు సినిమా వెధవలు (ఇంతకంటే మంచి మాటలు రావట్లా! వీళ్ళ శైలి చూస్తుంటే) పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. మన పవన్ కళ్యాన్ గారి జనసేన పరిమళం ఇలావుంటే జనం హర్షించరు. తస్మాత్ జాగ్రత్త! 


దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక సర్వోత్తమమైన తీర్పు ఇస్తే దాన్ని తుంగలో తొక్కటానికి ఈ సెలబ్రిటీలనబడే కుసంస్కారులు తయారయ్యారు. ప్రజలను మేల్కొలిపే కళారంగంలో ఈ నిష్క్రియాపరులు ఉంటే జాతి ఇంకేం బాగు పడుతుంది.


రాక రాక ఒక మంచి తీర్పు వచ్చింది. దాన్ని వీళ్ళు తుంగలో తొక్కించారు. అంత మగాళ్ళైతే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి కై  (హాదా) పోరాడొచ్చుకదా! అది నీ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకారి కదా! ఇంకా ఈ పవన్ దొరకి కోళ్ళ పందేలు కావాలట! సతీ సహగమనం, బాల్య వివాహాలు, వృద్ధలకు (పసి బాలికలతో)  వివాహాలు,  వరకట్నం,  కన్యాశుల్కం , జంతు బలులు, బహు భార్యాత్వం, వ్యభిచారం, దేవదాసీ వ్యవస్థ నరెంద్ర మోడీపై వత్తిడి చేసి పునః ప్రతిష్ఠ చేయిస్తే  జన్మ పావన మౌతుంది.



మొన్న 31, డిసెంబర్ రాత్రి బంగళూర్ లో యువకులు చేసిన లైంగిక విద్వంసం మీద ఏమీ మాట్లాడ లేదు. వీళ్ళకు జల్లికట్టు మీద ప్రేమెందుకు అంటే మనకు తెలియదా! తమిళనాడులో తమ సినిమాలను ఆడించు కోవాలంటే అక్కడ వాళ్ళను సమర్ధించాలి.  ఆ అరవ సినిమా వాళ్ళు ఏంచేస్తే  అది చెయ్యాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: