జల్లికట్టు ఆట హింసాత్మకమే: రాంగోపాల్ వర్మ




తమిళనాడు పుదుక్కోటై జిల్లాలోని రాపుసాల్ గ్రామంలో ఇదో జల్లికట్టు విషాదం. ఆదివారం ఉదయం ఈ గ్రామంలో హడావుడిగా నిర్వహించిన జల్లికట్టులో ఇద్దరు చనిపోగా 8 మంది గాయపడ్డారు. మదురైలో నిరసనల సందర్భంగా జరిగిన అందోళనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.


రాపుసాల్ విలేజ్‌లో అత్యంత వేగంగా పరుగులు తీస్తున్న ఎద్దును అదుపు చేయబోయి మోహన్ (30)  రాజా (30) అనే యువకులు మరణించారు. కొమ్ములతో అది పొడిచిన కారణంగా తీవ్రంగా గాయపడి వీరు మృతి చెందారని అధికారులు తెలిపారు.  జల్లికట్టును పెద్దఎత్తున నిర్వహించే  అలంగనల్లూర్‌లో ఈ క్రీడను ప్రారంభించకుండానే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మదురై నుంచి చెన్నైకి బయల్దేరబోతుండగా ఈ ఘటన జరిగింది.



జల్లికట్టుపై విధించిన నిషేదం ఎత్తివేసిన నేపథ్యంలో జరిగిన జల్లికట్టులో ఇద్దరు మరణించిన ఉదంతంపై రాంగోపాల్ వర్మ తాజాగా స్పందించారు. జల్లికట్టు అనాగకరిక మని, హింసా వినోదమని (శాడిజం) అంటే వినోదం కోసం మూగజీవుల్ని హింసిం చటంగా అభివర్ణించిన రాంగోపాల్ వర్మ- జల్లికట్టులో మరణించిన వారి గురించి ట్వీట్ చేస్తూ!   "జల్లికట్టు నిర్వహణలో ఇద్దరు మృతి చెందారు. 129 మంది గాయపడ్డారు. ఇప్పుడు జల్లికట్టు మద్దతుదారులు ఏమంటారు? దీన్ని చూస్తే! జల్లికట్టుపై దేవుడికి కూడా కోపం ఉన్నట్లుంది ఉంది. జల్లికట్టు మద్దతుదారులపై కోపంచూపిస్తూ! ఎద్దులపై జాలి చూపిస్తున్నట్లుగా ఉంది"  అని వ్యాఖ్యానించారు.


మరి ఇది నిజమేగా. దీన్నిబట్టి మన సూపర్ స్టార్,  పవర్ స్టార్, సార్లు! " శాడిజంను సాంప్రదాయం" తో కలిపి ప్రోత్సహిస్తున్నట్లే కదా! 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: