ఇండియా గురించిన 10 ఆసక్తిగొలిపే వాస్తవాలు..!

Chakravarthi Kalyan
ఇండియా గొప్ప ప్రజాస్వామ్య దేశం.. ఆ మాట కొస్తే ప్రపంచంలోనే  అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. సాపాటు ఎటూ లేదు ఒక పాటైనా పాడు బ్రదర్ అంటూ ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ పాడిన పాట మన దేశ విశిష్టతను చాటుతుంది. అలాంటి మరిన్ని మన దేశం గురించిన విస్తుగొలిపే వాస్తవాలు చూద్దామా.. 



1. మన దేశంలో కూతురు చదువు ఖర్చు కంటే పెళ్లి ఖర్చు  చాలా ఎక్కువ. 
2. పోలీసుని చూస్తే భద్రత కంటే భయం ఎక్కువ .
3. సిగ్గు చాలా ఎక్కువ అయినా జనాభా 121 కోట్లు


4. ఫోన్లు పగల కుండా స్క్రీన్ గార్డ్ వాడతారు, తలని కాపాడే హెల్మెట్ పెట్టుకోరు.
5 ఆఫీస్ కి అందరు హడావిడి కానీ ఎవడు టైం కి ఆఫీస్ కి రాడు
6. దంగల్ సినిమా లో ఫోగట్ వేషం వేసిన ఆమిర్ ఖాన్ సంపాదించిన సొమ్ము లో ఫోగట్ కుటుంబం వెయ్యో వంతు కూడా వాళ్ళు జీవితం మొత్తంలో సంపాదించ లేదు.



7. అస్సలు పరిచయం లేని వ్యక్తి తో ఆడపిల్ల మాట్లాడ కూడదు కానీ పెళ్లి చేసుకోవచ్చు.
8. గీత గొప్పదా ఖురాన్ గొప్పదా అని కొట్టుకు చచ్చే వాళ్లలో వందమంది లో ఒక్కడు కూడా వాటిని పూర్తి గా చదివి ఉండడు.
9. కాళ్ళకి వేసుకునే చెప్పులు ఏసీ షాప్ లో అమ్ముతారు, అన్నం లో తినే కూరగాయలు కాలువ ప్రక్కన అమ్ముతారు.
10. మేజిక్ ని చేసే బాబా ని నమ్ముతారు కానీ లాజిక్ ని చెప్పే సైంటిస్ట్ ని నమ్మరు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: