స్పెషల్ ఫీచర్: మహిళల అక్రమ రవాణా



మానవ జాతిని అత్యంత దుస్థితికి తీసుకు వెళ్ళే “అనైతిక అవ్యవస్థీకృత నేరపూరిత వ్యాపారాలు” ముఖ్యంగా మూడు.

1. మాదకద్రవ్యాల వ్యాపారం

2. మానవ అక్రమ రవాణా

3. అక్రమ ఆయుధ వ్యాపారం.




మానవ అక్రమ రవాణా

మైనర్ బాలికల అక్రమ రవాణా ఒక్కసారిగా గత రెండు మూడేళ్ళలో పద్నాలుగింతలు పెరిగింది. ఈ అనైతిక మానవ రవాణాలో 76% వరకు మహిళలు మరియు మైనర్ బాలికలు ఉన్నారు. ఈ  అక్రమ రవాణా ప్రపంచమంతా శరవేగంగా  ప్రబలిపోతోంది. గత దశాబ్దం కంటే పెరిగి 2014 లో  65% పెరుగుదల  నమోదుచేసింది.




నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన వివరాల ప్రకారం బాలికలు, యువతుల రవాణా యే ముఖ్య లక్ష్యంగా జరిగే మానవ అక్రమ రవాణా మొత్తం లో  76% నమోదైంది. 2014 లో రికార్డులకెక్కి బహిరంగంగా ఈ చర్యకు గురైన మహిళలు, బాలికల సంఖ్య భారత దేశ వ్యాప్తంగా 8099.



ఇందులో వ్యభిచారానికై అమ్మబడ్ద బాలికలు, మహిళలు,  విదేశాలనుంచి దిగుమతైన మహిళలు, వ్యభిచారానికై   కొనబడ్ద దేశీయ మహిళలు. లైంగిక దోపిడీ కై వీరినే యుద్ధం జరిగే ప్రాంతాలకు కూడా తరలిస్తారు.  



వ్యాపార ప్రయోజనాలకై  లైంగిక దోపిడీ  వివిధ పద్దతుల్లో జరుగుతుంది .  


1.  బ్రోథల్  ప్రొస్టిట్యూషన్ ( గృహ వ్యభిచారం ) :  ఒక గృహంలో వ్యభిచారం నిర్వహించటం  ఇది మహానగరాలలో అయితే ‘రెడ్-లైట్ ఏరియా’  లుగా ప్రసిద్ది. చాలా గ్రామాల్లో కూడా  వ్యాపించి, అందరికి తెలిసిన వ్యవహారమే.  

2.సెక్స్ టూరిజం  (శృంగార యాత్ర):  అనైతిక శృంగార యాత్ర అనేది వ్యభిచారం నేరంగా పరిగణించబడ్డ దేశాల నుండి అది నేరంగా పరిగణించని దేశాలకు తరలివెళ్ళేవారికోసం. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ లో వ్యభిచారం నేరం. కాని నేవడా ప్రాంతములో వ్యభిచారం చట్టబద్దం. అందుకే నేవడా ఒక సెక్స్ టూరిస్ట్ ప్లేస్. అంటే సురక్షిత అనైతికి శృంగార యాత్రా స్థలం. అక్రమ రవాణా ద్వారా మహిళలను, బాలికలను అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి రవాణా చేస్తారు. ఈ రొంపిలో వాళ్ళకు జీవితం గడచిపోతుంది.  

3. పోర్నోగ్రఫి: నీలి చిత్రాల, చలన చిత్రాల నిర్మాణం ఆడియో లేదా సిడిల ద్వారా అశ్లీల శృంగార వ్యాపారం లో ఇలా తరలించిన మహిళలను వినియోగించటం.

4. ఇతర అనైతిక అవసరాలు:  వెట్టిచాకిరి, మైనింగ్‌, ప్రైవేటు సైన్యం, టెర్రరిస్టుల తరఫున పోరాడేందుకు, అవయవాల వ్యాపారానికి, మాఫియా ముఠాల తరఫున బిచ్చగాళ్లుగా బానిసల్లా పనిచేసేందుకు.


  

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఐక్యరాజ్యసమితికి చెందిన మాదక ద్రవ్యాలు, నేరాల నిరోధక కార్యాలయం (UNODC) విడుదల చేసిన ఓ నివేదికలో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. వ్యభిచారం కోసం, నీలి చిత్రాల నిర్మాణం కోసం, వెట్టిచాకిరి కోసమే కాకుండా గనుల మైనింగ్‌ కార్యకలాపాల్లో బానిసల్లా పనిచేసేందుకు, ప్రైవేటుసైన్యంలో, టెర్రరిస్టుల తరఫున పోరాడేందుకు మానవులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మాఫియా ముఠాల తరఫున బిచ్చగాళ్లుగా మారేందుకు కూడా మనుషులను అక్రమంగా రవాణా చేస్తున్నారంటే వళ్లు జలదరిస్తుంది. 


 

ఓ దేశంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికే కాకుండా, ఓ దేశం నుంచి మరో దేశానికి, ఓ ఖండం నుంచి మరో ఖండానికి కూడా ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. అక్రమ రవాణా దారులు భారతీయ మహిళలనే కాకుండా లైంగిక వ్యాపారాల కోసం ఉక్రైన్, ఝార్జియా, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కైర్గైజిస్థాన్,  అజర్బైజాన్, చైచన్యా, నేపాల్, థాయిలాండ్, మలేషియా లాంటి దేశాల నుండి బాలికలు, మహిళలను దిగుమతి చేసుకుంటున్నారని ఐఖ్యరాజ్యసమితి నివేదిక చెపుతుంది.

 


ఇలా రవాణా అవుతున్న ప్రతి ముగ్గురిలో ఒకరు పిల్లలే ఉంటున్నారు. మొత్తం అక్రమ రవాణా లో 28 శాతం పిల్లలు ఉంటున్నారు. ఇక మహిళలు, బాలికలను కలుపుకొంటే 71 శాతం మంది ఉన్నారు. మహిళలను, బాలికలను సెక్స్‌-ట్రేడ్‌లోకి దించుతున్నారు, నీలి చిత్రాల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు.

 


యువకులు, బాలురు, ఇతర మగవాళ్ళు-విషయానికి వస్తే వీరిని అక్రమ రవాణా చేసి, బాలలను ఎక్కువగా బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు. యువకులను మైనింగ్‌లో పోర్టర్లుగా, వెట్టి చాకిరి కార్మికులుగా, ప్రైవేట్‌ సైనికులుగా అమ్ముతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్రమంగా రవాణా అవుతున్న 28 శాతం పిల్లల్లో సబ్‌-సహారా ఆఫ్రికా, మధ్య అమెరికా, కరేబియన్‌ ప్రాంతాల కు చెందిన పిల్లలే 62 నుంచి 64 శాతం ఉంటున్నారు. 


 


2012 నుంచి 2014 ఏళ్ల మధ్య ప్రపంచవ్యాప్తం గా కొనసాగిన మానవ అక్రమ రవాణా వివరాలను సేకరించి ఈ నివేదికను రూపొందించినట్లు యూఎన్‌ఓడీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యూరి ఫెదదోవ్‌తెలిపారు. ఉద్యోగాలు, మంచి జీతాలు ఇప్పిస్తామనే మాయమాటలకు కొంతమంది అమాయకు లు బుట్టలో పడుతుండగా, పిల్లల్లో ఎక్కువమంది కిడ్నాప్‌లకు గురవుతున్నారని ఆయన తెలిపారు.


 

మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు 2003 నాటికి ప్రపంచంలోని 18 శాతం దేశాల్లో కఠినచట్టాలు అమల్లో ఉండగా, నేడు 88 శాతం దేశాల్లో కఠినచట్టాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ చట్టాల కింద శిక్షలు మాత్రం తక్కువే పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


 

ప్రపంచవ్యాప్తంగా 2030 సంవత్సరం నాటికి మానవ అక్రమ రవాణాను గణనీయంగా అరికట్టాల నే లక్ష్యాలను సాధించాలంటే ఇలాంటి కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు కఠిన శిక్షలు విధించాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.


 


మానవ అక్రమ రవాణా మన దేశం లోని అన్నీ రాష్ట్రాలకు విస్థరించింది. గత దశాబ్ధ చరిత్ర పరిశీలిస్తే తమిళనాడు తొలి స్థానములో 9071 కేసులతో ముందుండగా, అంధ్ర ప్రదేశ్ 5801, కర్ణాటక 5443, పశ్చిమ బంగ 4190, మహరాష్ట్ర 3628 అధికారిక కేసులతో తరవాత స్థానాలు ఆక్రమించాయి. అనధికారికంగా ఈ సంఖ్యలు ఇంకా పది రెట్లకు మించి ఉండవచ్చు. అలాగే నగరాల్లో మన రాజధాని డీల్లీ ప్రధమ స్థానం, కొల్కతా ఇంచు మించు అదే స్థాయిలో రెండవ స్థానంలో ఉంది. ఉన్న సమా చారాన్ని బట్టి ఈ ఐదు రాష్ట్రాలు ఆ రెండు నగరాలు ఈ విషయం లో ఈ అక్రమ మానవ రవాణాకు ముఖ్యంగా మహిళల బాలికల రవాణాకు అడ్డాలుగా, గమ్యస్థా నాలుగా వనరులు సమృద్ది తో విరాజిల్లుతున్నాయి. అంటే ప్రభుత్వ, పోలీసు, అధికారులు, ఈ వ్యాపారులు, రాజకీయ, ఆర్ధిక, రవాణా, ఇన్-ఫ్రా సహకారం బాగా ఈ మానవ అక్రమ రవాణాకు సాను కూలంగా ఉన్నట్లు భావించాలి.


 


అయితే ఈ కేసులు అధికారికంగా రిజిస్టర్ అయినదాన్ని బట్టి చూస్తే తమిళనాడులో తగ్గుముఖం పడుతూ ఉండగా పశ్చిమ బంగా, ఆంధ్రప్రదేశ్ లో విస్త్రుతమౌతున్నట్లు కనిపిస్తుంది. యువతుల రవాణా - ఇతరత్రా పరిశీలిస్తే బహుళజాతి సరపరా దారుల (transnational traffickers) ద్వారా ముంబాయి, డిల్లీ రెడ్-లైట్పరిసరాల్లో  సరపరా చేయబడిన తమిళ యువతు లే పోలీస్ రైడ్స్ లో ఎక్కువగా పట్టుబడ్డారని యుఎన్ నివేదిక చెపుతుంది.


  


చివరికి మానవ అక్రమ రవాణా దినోత్సవం కూడా వచ్చేసింది. 2013 లో ఐఖ్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లి “మానవ అక్రమ రవాణా వ్యతిరెఖ దినం”  గా  జూలై 30 ని నిర్ణయించారు. అంతర్జాతీయ నేరాల్లో అక్రమ రవాణాది మొదటిస్థానం. విలువ 15వేల కోట్ల డాలర్లు. ఆడ, మగ, పిల్లలు అనే తేడా లేకుండా ఈ అక్రమ రవాణా యధేచ్చగా సాగిపోతోంది. మహిళలను సెక్స్ వర్కర్స్ గాను, పిల్లల్ని వెట్టి చాకిరీలోకి దిగజారుస్తున్నారు.




రవాణా ఎక్కువగా జరుతున్న మొదటి పది దేశాలలో భారత దేశం ఒకటిగా ఉండటం మన దురదృష్టం. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో తక్కువగా ఉండటానికి అక్కడ అమలయ్యే కఠిన చట్టాలే కారణం. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక పిల్ల లేదా పిల్లవాడు ఇండియాలో మాయం అవుతున్నారు. బీహార్, జార్ఖండ్,తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లలో వేలకొద్ది “మిస్సింగ్ కేసులు” నమోదవుతున్నాయి.




ఈశాన్య రాష్రాల లో రవాణా కేంద్ర బిందువు డిల్లి. మన చట్టాలు ఎంత చట్టుబండలుగా ఉన్నాయో తెలుస్తుంది. ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు వలస పోతున్నారు. వాళ్ళ చుట్టూ రవాణా మాఫియా వేళ్లూనుకుంటుంది. పేదరికంలో అల్లాడిపోతున్న ఆడపిల్లలు ఈ రవాణాలో కనీస సౌకర్యాలు, తిండి, నివాస సదుపాయాలు, వైద్యం ఏమీ దొరక్క లైంగిక రోగాలైన  HIV వంటి రోగాలే కాకుండా, మానసిక రోగాల బారినపడి పిచ్చివాళ్ళయి చచ్చిపోతున్నారు.




ఏ నిరోధక చర్యలు పనిచేయకుంటే, కొన్నాళ్ళలో ఈ మానవ అక్రమ రవాణాలో మనదేశం ఒకటో స్థానంలో నిలబడటం ఖాయం.ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కనీస మానవత్వంతో రవాణాలో అమ్ముడుపోతున్న, హీనమైన జీవితాలతో అల్లాడిపోతున్న, పురుగుల్లాగా బతుకుతున్న ఈ మానవుల పట్ల ఏవైనా చర్యలు తీసుకుంటే బావుండు.



అయితే, ఈ అనైతిక వ్యాపార ఉదృతిని ఎదుర్కోవటానికి యుఎన్ 2013 ఈ చట్టాలకు పదును పెట్టే క్రమంలో తొలిదశలో మూడేళ్ళ కఠిన కారాగ శిక్ష నుండి జీవిత ఖైదు అమలు చేయమని వివిధదేశాలకు నిబంధనలు విధించారు. ఈ నిబంధనలు అక్రమంగా బాలబాలికలను తరలించటం లైంగికదోపిడి, భౌతికదోపిడి అంటే బానిసత్వం, దాస్యం , బలవంతంగా బిక్షాటనకు దేహాంగాలను తొలగించటం, వారి దేహాంగాల అమ్మకం లాంటి దుఃశ్చర్యలకు వర్తిస్థాయి.


ఈ వ్యాపారం భారత్ లో మాత్రమే వర్దిల్లుతుందని అనుకోవటం నిజంకాదు ప్రపంచవ్యాప్తంగా దినదిన ప్రవర్ధమానమౌతుంది. సంఘటిత నేరాల్లో మానవ అక్రమ రవాణాది మూడవ ముఖ్యమైన అధికసంపాదన అంటే బిలియన్ల డాలర్లు అందిస్తున్న వ్యాపారం. మొదటి రెండు స్థానాల్లో మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధ వ్యాపారం  ఆక్రమించాయి.




మానవ అక్రమ రవాణా అంటే దుర్మార్గపు పద్దతుల్లో దోపిడీ చేసే ఉద్ధేశం తో మోసం, నయవంచన, బలప్రయోగం ద్వారా తోటి మానవులను దురాక్రమణ ద్వారా ఆదీనము లోకి తెచ్చుకోవటం".


దేశ వ్యాప్తంగా చూసుకుంటే మానవ అక్రమ రవాణా మొత్తం మీద సంఖ్యల్లో గత ఆరు సంవత్సరాల్లో 92% వరకు పెరిగి ఇప్పుడు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: