పాకిస్థాన్ క్రమశిక్షణా రాహిత్యదేశం. ఆ ప్రభుత్వాలు, నాయకులు, నిఘా విభాగాలు, చివరికి విదేశాల్లో నివసించే ప్రజలూ మొత్తం మీద సమాజానికి ఇబ్బందులే కలిగి స్తుంటారు. అది వారి నైజం. ఉగ్రవాద సృష్టికర్తల పాలనలో పౌరుల రీతి నీతి సంసయాస్పదమే. ఓకే. భారత్ అంటే దాయాది దేశం, శతృదేశం. మరి సౌదీ అరేబియా పూర్తిగా మత నిబంధనలను తుచ తప్పకుండా అనుసరించే దేశం. రెండు దేశాల మత ధర్మం ఒకటే, అలాంటప్పుడు సౌదీలో పాక్ పౌరుల తీరు సరిగ్గా ఉండాలి. కాని వారి తీరు అక్కడ కూడా ప్రశ్నార్ధక మౌతుంది.
సౌదీ అరేబియా ప్రభుత్వం చట్టాల విషయంలో అందరూ సమానమే అనే సిద్ధాంతాన్ని నూటికి నూరు శాతం తప్పకుండా అనుసరించే దేశం. పాకిస్తాన్ పౌరుల విషయంలో ఈ మధ్య సౌదీ అరేబియా, కాస్త ఎక్కువ కఠువుగానే ఉన్నట్లు తెలుస్తోంది. గడచిన నాలుగు నెలల్లో ఏకంగా 39వేల మంది పాకిస్తాన్ పౌరులను దేశం నుంచి బహిష్కరించిం దంటే, సౌదీ అధికారులు ఏ స్థాయిలో అప్రమత్తతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
పని నిమిత్తం అంటూ సౌదీకి వచ్చి, దోపిడీలు, దొంగతనాలు, డ్రగ్స్-రవాణా సంఘవ్యతిరేఖ వంటి చర్యలతో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు కొన్ని సమస్యలు సృష్టి స్తున్నారు. అటు వంటి వాటిల్లో సౌదీ లో నివసించే పాకిస్తాన్ పౌరులు ఆరితేరిపోయారని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు వీసా నిబంధనలను పాటించకపోవడం, రెసిడెన్సీ, పని విషయాల్లో కూడా నిబంధనలను పాటించకపోవడం, క్రమశిక్షణ అన్నదే పూర్తిగా కేకపోవటం వంటి ద్వారా సమస్యలు వస్తుండ్సటముతో మొత్తం 39వేల మంది పాకిస్తాన్ పౌరులను దేశం నుంచి బహిష్కరించినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.
కాగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వచ్చిన 82 మంది పాకిస్తాన్ పౌరులను అదుపులోకి తీసుకున్న ట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా దేశంలోకి వస్తున్న పాకిస్తాన్ పౌరులను తీక్షణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.