ఫోటో ఫీచర్ : ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..!

Edari Rama Krishna
తమిళం, తెలుగు, కన్నడ అగ్ర హీరోల సరసన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన నటి..ప్రముఖ రాజకీయ నాయకురాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.  మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో  ఫిబ్రవరి 24, 1948న జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది.  జయలలిత చిన్ననాటి అసలు పేరు కోమలవల్లి.   జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.  జయలలిత తన 15 వ యేటనే తల్లి కోరిక మేరకు సినీ రంగ ప్రవేశం చేసింది.  

జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది.  తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా టాప్ పొజీషన్ కి వెళ్లింది.  ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది.

1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.   తమిళనాడులో ఈమెను అమ్మ అని పిలిచేవారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: