ధారుణంగా దాడి చేస్తాం! అమెరికాకు హెచ్చరిక






పోరాటమే శరణ్యమనుకున్న వాళ్ళు ఎదురు తిరిగితే అవతల అమెరికా ఐనా రష్యా ఐనా చైనా ఐనా ఒకటే. ఒక నిర్ణయం అంతే మార్గనిర్దేశం చేస్తుంది. ఉత్తర కొరియా  ఇప్పుడు అమెరికాపై అవసరమైతే ఏవిధంగానైనా దాడిచేయటానికే సిద్ధం అంటూ అమెరికాను హెచ్చరించింది.  




తమ దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా కాని వ్యతిరేకంగా కాని ఏ చిన్న చర్య జరిగినా అమెరికా అలాంటి తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా హెచ్చరించింది. వాయు, జల, భూ మార్గాల ద్వారా జాలి, దయ లేకుండా దాడులు చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని ఆ దేశ అధికార న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ వెల్లడించింది.




దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న డ్రిల్స్‌ లో భాగంగా నేవి సూపర్‌ క్యారియర్‌  'కార్ల్ విన్సన్‌' ను యునైటెడ్‌ స్టేట్స్‌ మోహరిస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ విధంగా స్పందించింది. కార్ల్‌ విన్సన్‌ ను మోహరించడం వెనుక తమ దేశంపై దాడి చేయాలనే కుట్ర దాగుందని ఉత్తర కొరియా మండి పడింది. మార్చ్ 11న సైతం శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌లు తమ ప్రాదేశిక జలాల సమీపం లోకి వచ్చాయని ఉత్తర కొరియా ఆరోపించింది.






తమ దేశ ఆర్మీని టార్గెట్‌ చేయడం కోసమే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని కేసీఎన్‌ఏ పేర్కొంది. దక్షిణ కొరియా లో యాంటీ మిస్సైల్‌ సిస్టమ్‌ను మోహరించడం పట్ల అమెరికాపై చైనా కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: