కేసీఆర్ పై అక్బరుద్దీన్ పిట్టకథ.. భలే పేలింది..!?

Chakravarthi Kalyan
అసెంబ్లీలో సీరియస్ డిస్కషన్లే కాదు.. అప్పుడప్పుడూ నవ్వులూ విరబూస్తాయి. ఎప్పుడూ వాదోపవాదాలు సాగించుకునే అధికార విపక్షాలు.. అప్పుడప్పుడూ హాస్యంతోనే విమర్శలు సాగించుకుంటాయి. ఇలాంటి వెటకారాలు, ఎత్తిపొడుపులూ చూసేందుకు, వినేందుకు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి సంభాషణే తాజాగా తెలంగాణ అసెంబ్లీలోసాగింది. 



అసెంబ్లీలో కేసీఆర్ ను ఉద్దేశించి అక్బరుద్దిన్ ఓవైసీ చెప్పిన పిట్టకథ ! :-
ఒక సింగర్ నవాబ్ దగ్గర పాటలు పాడాడు..
నవాబ్ : వాహ్వ ! వీనికి ముత్యాలు ఇవ్వండి.
సింగర్ ఇంకా పాడాడు.
నవాబ్ : వీనికి మణులు మాణిక్యాలు ఇవ్వండి
సింగర్ ఇంకా పాడాడు.
నవాబ్ : వీనికి వజ్ర వైడుర్యాలు ఇవ్వండి.
సింగర్ ఇంకా పాడాడు.
నవాబ్ : వీనికి భూములు నజరానాగా ఇవ్వండి.
సింగర్ చాల సంతోష పడ్డాడు.



ఇంటికి వెళ్లి పెళ్ళాం బిడ్డలకు చెప్పుకున్నాడు.
 వాళ్ళు కూడా చాల సంతోష పడ్డారు.
ఎన్ని రోజులైనా నవాబ్ గారు అవి పంపించలేదు.
ఆ సింగర్ చూసి చూసి నవాబ్ దగ్గరకు వెళ్లి " అయ్యా! మీరు ఇస్తామన్న ముత్యాలు, 
మణులు మాణిక్యాలు, భూములు వగైరా నాకు ఇంతవరకు ఇవ్వలేదు.



నవాబ్ : ఇందులో ఇచ్చి పుచ్చుకొనుడు ఏముంది. నువ్వు మా చెవులకు ఇంపుగా పాడినావ్. 
నేను నీ చెవులకు ఇంపుగా చెప్పినాను . చెల్లుకు చెల్లు. ఇంకా ఇచ్చేడిది ఏందీ.?
ఇట్లాగే కెసిఆర్ కూడా మీరు వోట్లు వేసి నన్ను సంతోష పెట్టారు.
 అలానే మీకు బంగారు తెలంగాణా అని చెప్పి మిమ్మల్ని సంతోష పెట్టాను. 
చెల్లుకు చెల్లు. ఇంకేందిరా భై చేసేది.. ఇదీ ఆ పిట్టకథ..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: