రాష్ట్రపతి గా మళ్లీ ప్రణబ్...?

Shyam Rao

ప్రస్తుతం రాష్ట్రపతి గా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ని సోనియా గాంధీ సిఫారసుతో రాష్ట్రపతిగా మియామకం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన పదవి కాలం త్వరలో ముగియనుండడంతో రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. అయితే బీజేపీ తమకు సరైన అభ్యర్థులని వెతికే పనిలో నిమగ్నమవ్వగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం వివిధ అభ్యర్థులను పరిశీలన చేసి, చర్చలు, సమావేశాలు జరిపి మళ్లీ ప్రణబ్ కే మద్ధతు పలకాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 



దీనికి సరైన కారణాలు సైతం లేకపోలేదు. ప్రణబ్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సోనియా గాంధీకి మంచి విధేయుడు. విద్యా బుద్ధుడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అసమైక్యత మూలంగా పార్టీలో ఎలాంటి అభ్యర్థులను ఖరారు చేసినా ఫలితం మాత్రం అంతంతమాత్రమే. అందుకే ఇప్పటికే రాష్ట్రపతిగా కొనసాగుతున్న ప్రణబ్ ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాల తరుపున బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 



ప్రణబ్‌ను బీజేపీనే నామినేట్‌ చేస్తే తాము సంపూ ర్ణ మద్దతిస్తామని విపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్న నేతలు చెబుతున్నారు. అయితే అది అంత సులభంగా జరిగేలా లేదు. తనకు మళ్లీ రాష్ట్రపతి పదవిపై ఆసక్తి లేదని ప్రణబ్‌ తన సన్నిహితులతో అన్నట్లు తెలి సింది. బీజేపీ ప్రభుత్వం తనను మరోసారి నామినేట్‌ చేసే అవకాశం లేనందున మళ్లీ ఎన్నికలబరిలో దిగేందుకు ప్రణబ్‌ ఆసక్తిగా లేరంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: