ట్రంప్ ను దించేస్తారా? వేగంగా మారుతున్న ప్రజాభిప్రాయం



ఒక నేర విచారణపై లేదా ఆరోపణలపై పరిశోదన చేసే వారిని అర్ధంతరంగా పదవి నుండి తప్పించిన వారెవరైనా సరే "ముద్దాయి" అనలేము. ఖచ్చితంగా "నేరస్తుడు" అనే చెప్పొచ్చు.  అమెరికా మాజీ జాతీయ భద్రత సలహాదారు మైక్‌-ఫ్లిన్‌కు రష్యాతో ఉన్న సంబంధాలపై నీలి నీడలు కమ్ముకోవటంతో దానిపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతున్న తరుణం లో విచారణను ఆపివేయాలని, "మైక్‌-ఫ్లిన్‌ మంచివారు మీరు అతనిపై విచారణను ఇంతటితో ఆపేయవచ్చని ఆశిస్తున్నా" అని ఆ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న జేమ్స్‌-కోమీ ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు


ఆ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్‌ తనతో వ్యాఖ్యానించినట్లు కోమీ అధికారిక మెమో ల్లో పేర్కొన్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ వార్త ప్రచురించింది. మైక్‌-ఫ్లిన్‌ రాజీనామా చేసిన మరుసటి రోజు (ఫిబ్రవరి 14)న ఈ మేరకు ట్రంప్‌తో జరిగిన సంభాషణ వివరాలు కోమీ రికార్డుల్లో నమోదు చేసినట్లు పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణకు నాయకత్వం కోమీని, ఇటీవల ట్రంప్‌ అర్ధంతరంగా ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 


రష్యాతో తొలి నుండీ డొనాల్డ్ ట్రంప్‌ సంబంధాలపై వస్తున్న ఆరోపణలన్నింటిపై విచారణ జరగాలని ప్రతిపక్షాలు ముఖ్యంగా డెమోక్రాట్స్ డిమాండ్‌ చేస్తున్నారు. అత్యంత రహస్యమైన నిఘా సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు మరియు వారి రాయబారులకు చెప్పేసి, ఇరకాటంలో పడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన తీర్మానం పెట్టాల్సిందేననే డిమాండ్లు డెమొక్రాట్ల నుంచి వినపడుతున్నాయి. 


ప్రతినిధుల సభ, సెనెట్‌, ఈ రెండింటిలోనూ రిపబ్లికన్‌ పార్టీకే మెజారిటీ ఉంది. కాబట్టి అభిశంసన తీర్మానం నెగ్గడం అంత సులభం కాదు. అయితే ప్రజాభిప్రాయం కూడా వేగంగా ట్రంప్‌ కు వ్యతిరేకంగా మారుతోంది. ప్రైవేటు సంస్థ "పబ్లిక్‌ పాలసీ పోలింగ్‌ (పీపీపీ)" మంగళవారం (16.05.2017) విడుదల చేసిన సర్వేలో, ఏకంగా 48% అమెరికన్లు ట్రంప్‌ను అభిశంసించాల్సిదేనన్నారు. దీనికి వ్యతిరేకంగా 41% ఓటు చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం పనితీరు బాగుందన్న వారు 40%, కాగా పాలనపై పెదవి విరిచిన వారు ఏకంగా 54%  ఉండటం గమనార్హం. 


ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌-కోమీని అర్ధంతరంగా పదవి నుంచి తొలగించాక అంటే ఈ నెల 12 నుంచి 14 మధ్య జరిగింది. కాబట్టి కొద్దికాలం లోనే అయ్యవారికి ఉద్వాసన తప్ప దంటున్నారు అమెరికన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: