"పోర్ పోర్ రజనీ(కాంత్) బోర్" రాజకీయరంగ ప్రవేశంపై విరక్తి కలిగింది: నటి కస్తూరి




"రాజకీయాల్లోకి రావడమా? మానడమా?" అనే విషయంలో దశాబ్ధాల తరబడి డోలాయమాన స్థితిలో రజనీకాంత్‌ తన నిర్ణయ రాహిత్యంతో సతమతమయ్యే ధోరణి విరక్తి కలిగిస్తోందని సినిమా నటి కస్తూరి శనివారం తన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఈమె ఒక  మాజీ హీరోయిన్, కొన్నాళ్ల క్రితం ఒక తెలుగు స్టార్ హీరోపై లైంగిక పరమైన వ్యాఖ్య లతో వార్తల్లోకి వచ్చారు. తను ఆ హీరో పేరు చెప్పకపోయినా, తనను లైంగికంగా కోరుకున్నాడంటూ, వేదించారంటూ చెప్పిన భామ, కొన్ని క్లూస్ అయిరే ఇచ్చారు. వాటి ప్రకారం జనాలు ఇప్పటికే ఆ కథానాయకుడెవరో?  ఒక అంచనాకు వచ్చేశారు కూడా. అలాంటి కస్తూరి ఇప్పుడు మరోసారి రజనికాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై తన వ్యాఖ్య లతో సంచనలం సృష్టించింది.


"దశాబ్దాల తరబడి తనకు తాను సొంతగా నిర్ణయం తీసుకోలేకపోతున్న వ్యక్తి, నిర్ణయాత్మక నాయకుడు ఎలా అవుతాడు?" అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. సరైన రాజ కీయ నాయకుడు అంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు శక్తి సామర్ధ్యాలు కలిగిఉండాలని, అసలు రాజకీయాల్లోకి రావాలో? లేదో? నిర్ణయించుకోలేక పోతున్న పుడు ఆయన సరైన నాయకుడు ఎలా అవుతారు" అని రజని పై పరోక్షంగా తన అనుమానాన్ని వెలిబుచ్చారు.


ఐదేళ్లుగా అభిమానులను కలుసుకుంటూ ప్రతిసారీ "పోర్‌..పోర్‌... రజనీ బోర్‌" (యుద్ధం...యుద్ధం..అంటూ రజనీ బోర్‌)  బోరు కొట్టిస్తున్నారని ఆమె అన్నారు. మంచి నేత రాజకీయరంగ ప్రవేశం  కోసం,  "టు బి...ఆర్ నాట్ టు బి...దట్ ఈజ్ ది క్వశ్చన్"  అనే హాంలెట్ ధోరణి రజనీకి ఈ పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదన్నారు.  అదీ కొన్నేళ్ళు గా అవలంభించే రజనీ ధోరణి నుంచి ఎలాంటి పాలనను ఎక్స్పెక్ట్ చేస్తామని ఆమె ప్రశ్నించకనే ప్రశ్నించారు.



"రాజకీయాల్లోకి రావాలా? వస్సా? వస్తానో? రానో?" అంటూ రజనీ దంవత్సరాల తరబడి ఎందుకు ఆలోచిస్తున్నారో? అర్ధం కావటం లేదని ఆమె ఎద్దేవా చేశారు. కస్తూరీ చేసిన విమర్శలపై రజనీ అభిమానులు విరుచుకుబడ్డారు. "నీవు కూడా రజనీ గురించి మాట్లాడుతున్నావా? అంతా టైమ్‌! ఎంచేస్తాం! నోరు మూసుకుని పోవే" అంటూ ఒక అభిమాని పెట్టిన పోస్ట్కి ఆమె సైతం ఘాటుగా బదులిస్తూ "నీవు పుట్టక ముందు నుంచి నేను రజనీ అభిమానిని, నీలాంటి మర్యాదలేని అభిమానుల వల్లనే రజనీకి చెడ్డపేరు, అవమానం! ముందు నీ నోరు మూసుకో" అని ట్విట్టెర్ లో ఆమె ప్రతిస్పందించారు. అయితే గతంలో మాదిరిగానే ఈ సారి కూడా జాగ్రత్తపడ్డ కస్తూరి రజినీ పేరు మాత్రం ఎత్తలేదు. 


"రజనీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు, సినిమారంగంలో ఉండి విమర్శిస్తున్నావు! ఎంత అమర్యాద" అని మరో అభిమాని వ్యాక్యానించాడు దానికి కూడా  కస్తూరీ బదులిస్తూ "నేను రజనీకాంత్‌కు వీరాభిమానిని, నేను చేసేది విమర్శలు కాదు, విరక్తి తో అంటున్న మాటలు, ఇదే విరక్తి అందరి మనస్సులోనూ ఉంది, అదే నేను బయటకు  చెబుతున్నాను" అని ఆమె ట్వీట్‌ తో ప్రతిస్పందించారు. 


దీంతో పాటు  #nobattlecriesplease అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను తగిలించింది కస్తూరి. అంటే రజినీకి వ్యతిరేకంగా వ్యాఖ్య చేసిన వెంటనే, ఆయన అభిమానుల నుండి ఎదురుదాడి తప్పదన్న విషయం కస్తూరికి బాగా తెలుసు కనుకనే తనపై ఎలాంటి యుద్ధం చేయవద్దని సున్నితంగా చెప్పి, తన భావాన్ని వ్యక్తీకరించటం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: