‘బాబుతో బాబా కలువడమా’:టీఆర్ఎస్ ఎద్దేవా

 హైదరాబాద్: అవినీతి సామ్రాట్గా పేరు ప్రఖ్యాతలుగాంచిన టీడీపీ అధినేత చంద్రబాబుతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న యోగా గురువు రాందేవా బాబా కలువడంపై టీఆర్ఎస్ అసంత్రుప్తిని వ్యక్తం చేసింది. రుసరుసలాడింది. అవినీతికి వ్యతిరేకంగా బాబు పోరాడతానంటే ఇక్కడి ప్రజలు విశ్వసించరనీ, ఈ విషయాన్ని యోగా గురువు రాందేవా బాబా గ్రహించాల్సిందిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట తారక రామారావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అవినీతిపై పోరాటం ఆహ్వానించదగ్గదే. దీనికి అందరూ సహకరించాల్సిందే. కానీ, అవినీతిని పెంచి పోషించిన వారిని పక్కన కూర్చుండబెట్టుకుని అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానంటే ఎవరూ నమ్మరనే విషయాన్ని రాందేవా బాబా గుర్తుంచుకోవాలన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారి పక్కన అవినీతికి కేరాఫ్గా పేరు గడించిన వారు కూర్చుంటే ఆ మచ్చ తమపైన కూడా పడే ప్రమాదం వుందనీ, దీన్ని యోగా గురువు గుర్తు పెట్టుకోవాలనీ టీఆర్ఎస్ కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: