కేసీఆర్ పై సినిమా.. ఆయన పాత్రధారి ఎవరో తెలుసా..!?

Chakravarthi Kalyan
సినిమాలకు చరిత్ర చాలాసార్లు ముడిసరుకుగా ఉపయోగపడుతుంది.. గతించిన కాలంపై ఇప్పటి కాలానికి ఉన్న ఉత్సుకత, ఆసక్తే ఇందుకు కారణం.. అలనాడు చారిత్రక ఘట్టాలు ఎలా జరిగాయి.. అప్పట్లో జరిగిన పరిణామాలేంటన్నవి ఇప్పటి తరానికి ఆసక్తిగానే ఉంటాయి. ఇప్పుడు గ్రాఫిక్ రంగం మరింతగా అభివృద్ది చెందడంతో చారిత్రక సినిమలపై మోజు పెరుగుతోంది. 


ఐతే.. తాజాగా తెలంగాణ రాష్ట్రం సాధించిన చరిత్ర సృష్టించిన కేసీఆర్ జీవిత చరిత్రను కూడా సినిమాగా తీయాలని నిర్ణయించడం విశేషం. పెళ్లిచూపులు ఫేం రాజ్ కందుకూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారట. కేసీఆర్ జీవితం.. తెలంగాణ ఉద్యమం ప్రధానాంశాలుగా ఈ సినిమా ఉంటుందట. 1967 తొలి తెలంగాణ ఉద్యమంతో ప్రారంభమై తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకూ కథ ఉంటుందట. 


అంతా బాగానే ఉంది. మరి కేసీఆర్ పాత్ర ఎవరు పోషస్తారు.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. బాలీవుడ్ నటుడు రాజకుమార్ రావును ఈ పాత్రకు ఆలోచిస్తున్నట్లు సినిమా డైరెక్టర్ మధుర శ్రీధర్ అంటున్నారు. కేసీఆర్ పోలికలు ఈయన ముఖానికి దగ్గరగా ఉంటాయి. మరో తమిళ నటుడు  విజయ్ ఆంటోని పేరు కూడా పరిశీలిస్తున్నారట. మొత్తానికి మరో ఆసక్తికర చరిత్ర సినిమా వస్తుందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: