రాజకీయ వ్యూహం లేని 'ట్విట్టర్ పిట్ట పవన్ కళ్యాణ్' ప్రజలకు చేసేది నయవంచనేనట




పవన్ మద్దతు తో ఏర్పడ్డ టిడిపి-బిజెపి ప్రభుత్వ నిర్వాకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ధారుణంగా విమర్శిస్తున్నారు. మద్దతిచ్చి ప్రజలచే ఓట్లేయించి తను అధికారంలోకి తెచ్చిన సంకీర్ణం రాష్ట్రంలో వేసే పిల్లిమొగ్గలు చూస్తూ సరైన విధంగా స్పందించని పవన్ పార్టీ జనసేన అధికారం లోకి రావాలని ప్రజలేమీ కోరుకోవటం లేదు. ఆయన మద్దతు ప్రకటిస్తే అధికారం లోకి వచ్చే పార్టి ఏంచేయగలదో ప్రస్తుత ప్రభుత్వం ఋజువు చేస్తూనే ఉంది. అయితే:  


పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ మళ్లీ చురుకుగా మారటం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. దాదాపు నాలుగు వారాల పాటు ట్విట్టర్‌కి దూరమైన పవన్‌ ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతూ తిరిగి ట్విట్టర్‌ లో పునఃప్రవేసించారు అంటే రీ-ఎంట్రీ ఇచ్చాడు. 


ఇన్నాళ్ళకు ఈ మెరుపు రాజకీయ వీరుడు పవన్‌ కళ్యాణ్ తిరిగొచ్చాడని ఆనందపడాలో, మరోసారి ప్రత్యేక హోదా పోరాటాన్ని కీబోర్డ్‌ మీదుగానే అనే ట్విట్టర్ మాధ్యమం గానే చేస్తున్నాడని విచారించాలో అర్థం కాని అయోమయంలో అభిమానుల్ని పడేసాడు. 


మార్చి నెల లో ప్రత్యేక హోదా గురించి పవన్‌ గళమెత్తినపుడు, పరీక్షల సమయం కనుక తాను చేసే పోరాటాన్ని మే నెలకి వాయిదా వేస్తున్నట్టు పవన్‌ ప్రకటించాడు. తీరా మే నెలలో త్రివిక్రమ్‌ దర్శకత్వములో నిర్మించబడుతున్న సినిమా షూటింగ్‌ తో పవన్‌ బిజీ బిజీ అయిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తోంటే వారికి మద్దతు తెలిపాడు. అసలు రాష్ట్రాన్ని అధర్మంగా నిట్టనిలువుగా చీల్చి గుంటనక్క రాజకీయాలు చేసే కాంగ్రెస్ తొనా కలసి పోరాటం చేయటం. 


ఘట్టిగా మాట్లాడితే ప్రత్యేక హోదా విషయంలో ఎవరు పోరాటం చేసినా తన మద్దతు వుంటుందని చెప్పాడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ని తరిమికొట్టమని చెప్పి, ఇప్పుడు వారికి మద్దతు నివ్వడంతో అసలు "పవన్‌ పార్టీ జనసేన విధి విధానాలు" ఏమిటో? రానున్న సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆయన స్వంతంగా పోటీచేయరా?
ఎవరితో కలసి ప్రత్యేక హోదా కోసం యుద్ధం చేస్తారు? హోదా ఎలా సాధీతారు? ఆయన కథా కమామిషు ఏమిటో ఏ మానవ మాత్రునికి అంతు చిక్కడం లేదు. 


ఇలా సీరియస్‌నెస్‌ లేని రాజకీయ నాయకుని రాజకీయవాదం సిద్ధాంతాం విధివిధానాలు లేని రగడ వల్ల పవన్‌ కళ్యాణ్‌ని జనం సీరియస్‌గా తీసుకుంటారనిపించడం లేదు. దాదాపుగా పవన్ మాటలు, మీటింగులు అంటే "కాలక్షేపానికి బఠాణీలు" మాదిరిగా మారిపోయాయి. ముఖ్యంగా ఆయనది సినిమా రంగాన్ని విడిచి బయటకి రాలేని ఆర్థిక పరిస్థితి కనుక పూర్తి స్థాయి రాజకీయాలతో పవన్‌ బిజీ అయ్యేది ఏనాటి కనేది అర్థం కావడం లేదు.


పవన్ నుంచి సరైన బలమైన ప్రజలకు మేలుచేయగల రాజకీయాలను ఆశించటం కరక్టు కాదంటున్నారు విజ్ఞులైన రాజనీతిజ్ఞిలి. పవన్ మద్దతును అనుసరించి ఓట్లేస్తే ప్రజలకు మరోసారి జరిగేది "నయవంచన" మాత్రమే ఔతుంది. ప్రజారాజ్యం అనుభవం నుంచి ఏపి వాసులు పాఠాలు నేర్చుకుంటే మంచిది. ఈ ట్విట్టర్ పిట్టలు కూతలు కూయటం తప్ప ఏమీ చేయలేవని ప్రజలు ఇకనైనా గుర్తిస్తే మంచిదంటున్నారు రాజనీతిజ్ఞులు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: