ఆ దుకాణం తెరవడమే ఆలస్యం ఎగబడి ఎగబడి కొంటున్నారు...!!

Shyam Rao

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లలో, బహిరంగ ప్రదేశాల్లో ఎంతో ప్రచారం చేస్తున్నా మందుబాబులు ఆ విన్నపాన్ని పెడిచెవిన పెట్టినట్లు అనిపిస్తోంది. ఒక్కరోజు వైన్ షాపులు బంద్ చేస్తేనే బందుబాబుల కిక్కు తగ్గిందో ఏమో గానీ ఒక్క సారిగా వైన్ షాపులపై ఎగబడుతున్నారు. నూతన మద్యం పాలసీతో ప్రస్తుతమున్న బార్లు, మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ముగిసింది. లైసెన్స్‌ పునరుద్ధరణ జాప్యంతో నిన్న నగరంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి.



మందు దొరక్క విజయవాడలో మందుబాబులు నానా ఇబ్బందులు పడ్డారు. ఆదివారం కావడంతో మందుబాబులు బారుల ముందు క్యూ కట్టారు. కొత్త మద్యం పాలసీ కారణంగా ఏపీలో వైన్ షాప్‌లు మద్యం ప్రియులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ మద్యం అయిపోతుందో అన్న తొందరతో  మందు బాబులు ఎగబడి ఎగబడి మరీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మద్యం కోసం తోపులాటలతో గందరగోళ పరిస్తితులు నెలకొన్నాయి.



పోలీసులు రంగ ప్రవేశం చేసి  మందుబాబులను అదుపు చేస్తున్నారు. లైన్‌లో వచ్చిన వారికే మందు విక్రయిస్తారని వైన్‌షాప్‌ యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం మిగతా దుకాణాలకు త్వరగా లైసెన్స్‌లు మంజూరు చేస్తేనే తమ కష్టాలు తీరుతాయని మందుబాబులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: