బాహుబలి స్టంట్స్ చేసి ప్రాణాలు కోల్పోయిన వ్యాపారి..!

shami
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ప్రభాస్ చేసిన విన్యాసాలు అన్ని ఇన్ని కావు. అయితే అది తెర మీద కాబట్టి వాటిలో ఏది నమ్మశక్యం కాదు. కేవలం ప్రేక్షకులను ఉత్తేజ పరచేందుకే అలా చేస్తారు. కాని తెర మీద హీరోలని చూసి తమని తాము హీరోలుగా భావించే కొందరు పొరపాట్లు చేస్తుంటారు..తమ ప్రాణం మీదకు తెచ్చుకుంటారు.


ఇలాంటి సంఘటనే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ఇంద్రపాల్ అనే వ్యాపారి స్నేహితులతో కలిసి జలపాతాల దగ్గరకు వెళ్లాడు. అయితే అక్కడ బాహుబలిలా దూకుతా చూడండి అంటూ వీర విన్యాసం చేయబోయాడు. దూకినప్పుడు బాగానే ఉన్నాడు కాని ల్యాండింగ్ లో ఏదో తేడా జరిగింది. నీటి లోపల ఏం గుద్దుకుందో ఎక్కడ గుద్దుకుందో తెలియదు కాని ఇంద్రపాల్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడట.


మహారాష్ట్ర షాహోపూర్ లోని మహులి కోట వద్ద ఈ ఘోరం జరిగిందని తెలుస్తుంది. బిజినెస్ మ్యాన్ అయిన ఇంద్రపాల్ ఇలా తెలిసి తెలిసి ప్రాణాలను వదలడం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. కోరి మరణాన్ని తెచ్చుకున్న ఇంద్రపాల్ చూసి స్నేహితులంతా దిగ్బ్రాంతికి గురయ్యారు.


సినిమా ఒక క్రియేటివ్ ఇమాజినరీ థింగ్.. తెర మీద హీరో చేసే విన్యాసాలన్ని నిజాలు కావు. దాని ఉదహరణగా తీసుకుని తమ లైఫ్ ను రిస్క్ లో పెట్టకూదడు. ఇంద్రపాల్ విషయంలో జరిగిన ఈ దుర్ఘటన అందరికి కనువిప్పు కలిగేలా చేస్తుందని అనుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: