చిన్నపిల్లల అక్రమరవాణా కేసులో బిజెపి ఎంపీ రూపా గంగూలీ?




రూపా గంగూలి దూరదర్శన్ టివి ఎపిసోడ్స్ లో 1988 లో విస్త్రుతంగా ప్రసారమై ప్రాచుర్యం పొందిన మహాభరత్ దృశ్యకావ్యం లో ద్రౌపది పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసిని పాత్రధారిణి. ద్రౌపదిగా ఆమె నటన అనిర్వచనీయం. మనకందరికి చిరపరిచిత మైన పేరు ' 

బెంగాల్‌లో చిన్న పిల్లల అక్రమ రవాణా కేసుకు సంబంధించి బీజేపీ మహిళా ఎంపీ రూపా గంగూలీని రాష్ట్ర నేర పరిశోధక విభాగం (సీఐడీ) విచారించింది. కోల్‌కతాలోని రూపాగంగూలీ నివాసానికి శనివారం వెళ్లిన ముగ్గురు సభ్యులతో కూడిన సీఐడీ బృందం, ఆమెను దాదాపు మూడు గంటలపాటు ప్రశ్నించింది. 




బెంగాల్‌లోని 'జల్‌పైగురి' లో పెద్ద ఎత్తున నడుస్తున్న 'చైల్డ్‌ ట్రాఫికింగ్‌ రాకెట్‌' ను ఈ ఏడాది ప్రారంభంలో సీఐడీ భగ్నం చేసిన సంగతి తెలిసిందే. 'బిమ్లా శిశుగృహ' కేంద్రంగా ఈ దందా సాగినట్టు విచారణలో తేలింది. 17 మంది చిన్నారులను దత్తత పేరు తో విదేశీయులకు అక్రమంగా అమ్మినట్టు అధికారులు నిర్ధారించారు. 





కాగా, ఈ కేసులో బీజేపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ ప్రధాన కార్యదర్శి జుహీ చౌదరితో సహా పలువురిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదిలాఉండగా, అరెస్టయిన జుహీ చౌదరిని రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ కలుసుకోవడం చర్చాంశనీయంగా మారింది. దీంతో ఈ రాకెట్‌లో రూపా గంగూలీకి కూడా ప్రమేయమున్నదా? అన్న కోణంలో ఆమెను ప్రశ్నించినట్టు సీఐడీ అధికారిణి ఒకరు తెలిపారు. 




అయితే, రూప ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని, మరోసారి ఆమెను ప్రశ్నిస్తామని ఆమె వెల్లడించారు. కానీ, మళ్లీ ఎప్పుడు విచారిస్తారన్న దానిపై ఆ అధికారిణి స్పష్టత ఇవ్వలేదు. ఇదే కేసులో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గియా తో పాటు మరో ఇద్దరు నేతలకు సమన్లు జారీ చేసినట్టు సీఐడీ వెల్లడించింది. మరోవైపు జుహీ చౌదరి అమాయకురాలని, కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధాలూ లేవని రూపాగంగూలీ చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: