చంద్రబాబు నడిరోడ్డు పై కాల్చి చంపాలి..ఇందుకేనా..?!

గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది.  ఈ సందర్భంగా ఇరువర్గాల వరు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  ఏ చిన్న చాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూస్తుంది ప్రతిపక్షం.  మరోవైపు తాము తీసుకు వస్తున్న సంక్షేప పథకాలకు ప్రతిసారి అడ్డుతగులుతూ..అభివృద్దిని అడ్డుకుంటున్నారని అధికార పక్షం వారు ఆరోపిస్తున్నారు.

 ఏది ఏమైనా ఈ మద్య కొన్ని సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు జగన్ ల మద్య ఘాటైన మాటల యుద్దం జరుగుతుంది.  అవును జగన్ అన్నదాంట్లో తప్పేముంది.


1) 65సం"వయసులో మనవడితో ఆడుకోక.నా రాష్టం ,నా ప్రజలు అంటు తిరుగుతున్నందుకు కాల్చి చంపాలి.

2)తన అధికారం అడ్డు పెట్టుకోని కోడుకుకు లక్ష కోట్లు దోచి పెట్టనందుకు కాల్చి చంపాలి.

3)అధికారం అడ్డు పెట్టుకోని బావమరదులతో ఆడబిడ్డల స్థలాలు కబ్జాలు చేయించనందుకు కాల్చి చంపాలి.

4)ప్రతిపక్ష నాయకులను హత్య చేయించనందుకు కాల్చి చంపాలి.

5)జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేయనందుకు కాల్చి చంపాలి .

6)తన కుటుంబాన్ని వదిలి రాష్ట భవిష్యతు కోసం బస్స్ లో నిద్రిస్తు పరిపాలన చేస్తున్నందుకు కాల్చి చంపాలి.

7)200 రూ పించను 1000-1500 చేసి వితంతువులకు దివ్యాంగులకు వృద్ధులకు మేలు చేసినందుకు కాల్చి చంపాలి.

8)పట్టిసీమ నిర్మాణం చేసి కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చి .ఆ డెల్టా వాడకం నీళ్ళను రాయలసీమకు ఇచ్చినందుకు కాల్చి చంపాలి.

9)హుదుద్ తుపాన్ వచ్చినప్పుడు దెబ్బ తిన్న వైజాగ్ కు పూర్వ రుపం తీసుకోచ్చినందుకు కాల్చి చంపాలి.

10)ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడా ఈ విధంగా జరగని భూ సమికరణ. రక్తపు చుక్క చిందకుండా 32 వేల ఎకరాల భూ సమీకరణ చేసినందుకు కాల్చి చంపాలి.

11) దేశంలోనే కలగా మిగిలిపోయిన. మొట్టమొదటి నదుల అనుసంధనం చేసినందుకు కాల్చి చంపాలి.

12)రాజధానే లేని రాష్టానికి రాజధాని నిర్మాణం చేస్తునందుకు కాల్చి చంపాలి.

13)లోటు బడ్జట్ ఉన్న రాష్టంలో సర్+ పవర్ లోకి తీసుకోస్తునందుకు కాల్చి చంపాలి.

14)కాపుల కోసం బ్రహ్మణుల కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృధి తోడ్పడుతునందుకు కాల్చి చంపాలి.

15) 16 నెలలు జైల్లో ఉండనందుకు కాల్చి చంపాలి 

ప్రజలకు మంచి చేసే వ్యక్తినీ కాల్చి చంపాలి.  ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు గా ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ వ్యక్తిగతంగా ఏ విషయాన్ని తీసుకోకుండా వుండాలసిన లక్షణం ఒక్కటి లేకపోవటం ప్రజలు చేసుకున్న తప్పిదం.  ఇలా చేయడం వల్ల ప్రజల్లో నిరుత్సాహం పెరుగుతుంది..నమ్మకం సన్నగిల్లుతుంది. 

సీఎం కావాలంటే ప్రజల మనసు గెలవాలి..వారికి అభివృద్ది అనేది ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించాలి.  హామీలతో ఏమీ వొరగదని ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే  ఢిల్లీ లో ఎర్రకోట దగ్గర నిరసన తెలియజేయాలి అప్పడు అంతర్జాతీయంగా ఎక్కడికో ఎదిగిపోతావ్.

_ Vyasakartha : E B Chowdhary



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: