బాబోయ్.. ఈ చేపను తింటే ప్రాణాలు పోతాయట..!

Edari Rama Krishna
ప్రపంచంలో చేపల కూర అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు.  ఎందుకంటే ప్రొటీన్లకు ప్రొటీన్లు, రుచికి రుచి అన్ని రకాలుగా వండుకు తినే విధంగా ఉండే చేపల కూర ఎవ్వరైనా ఇష్టపడతారు.  అలాంటి చేపల్లో విషం చేపలు ఉంటాయంటే నమ్ముతారా..! కానీ ఇప్పుడు నమ్మాలీ అంటున్నారు ఆంధ్ర విశ్వ విద్యాలయం మెరైన్ లివింగ్ రిసోర్సెస్(ఎంఎల్ఆర్) పరిశోధకులు.  

తాజాగా ప్రపంచంలో అత్యంత విషపూరిత చేప జాతుల్లో ఒక రకం విశాఖ తీరంలో లభ్యమైంది. షార్ప్ టైల్ చేపగా పిలిచే ఈ జాతి చేపల్ని తింటే ప్రాణాలు పోవడం ఖాయమంటున్నారు. సాధారణంగా కొన్ని దెయ్యం చాపలని అని అంటుంటారు..అవి తింటే తెలియని రోగాలు వచ్చి ప్రాణాలకు ప్రమాదం అని జాలర్లు అంటుంటారు. కానీ అవి ఏలా ఉంటాయో వారికి కూడా తెలియదు.  

అయితే విశాఖలో దొరికిన ఈ చాప చూసి జాలర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.  షార్ప్ టైల్ చేపను తింటే దానిలో ఉండే పాయిజన్ అనే విషపూరిత గ్రంధుల వల్ల వీటిని తిన్న వెంటనే వాంతులు, పక్షవాతానికి గురై మరణిస్తారని చెబుతున్నారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయం మెరైన్ లివింగ్ రిసోర్సెస్(ఎంఎల్ఆర్) విభాగం పనిచేసే పూర్వ అధిపతి ప్రొఫెసర్ దేవర వేణు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిషింగ్ టెక్నాలజీ(సీఐఎఫ్.టి)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ ఎన్ఎం కృష్ణ, నన్నయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి.గోవిందరావు సముద్ర జాతులపై, మత్స్య సంపదపై జరుపుతున్న పరిశోధనల్లో భాగంగా ఈ షార్ప్ టైల్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: