వినాయకచవితి సందర్భంగా ప్రజలందరూ..ఒక్కసారి ఆలోచించాల్సిన విషయాలు..!

frame వినాయకచవితి సందర్భంగా ప్రజలందరూ..ఒక్కసారి ఆలోచించాల్సిన విషయాలు..!

Edari Rama Krishna
 మనము తెలిసి తెలిసి కొన్ని క్షమించరాని తప్పులు చేస్తున్నాము.   ప్రతీ వినాయక చవితికి  ఇదే తంతు జరుగుతుంది. ఏంటంటే అసలు వినాయకుణ్ణి మనం మండపాలల్లో ఎందుకు ప్రతిష్టిస్తున్నాము ? అందులో అంతరార్థం ఏంటి ? ఈ విషయం లో చాలా మంది తప్పుదోవ పడుతున్నారు. 
వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందండి .
Image result for gabbar singh ganesh

వినాయక సహస్ర నామాలలో వెయ్యి రకాలు చెప్పబడాయి . అలాంటి వినాయక  ప్రతిమలు ఎంతో  భక్తి పారవశ్యాన్ని  కలుగజేస్తాయి.    కానీ ప్రస్తుత కాలంలో  ఎవరి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారుచేయించుకుని   పూజిస్తున్నారు. ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధం.

Image result for gabbar singh ganesh

ఫిదా  గణపతి,  గబ్బర్ సింగ్ 2 గణపతి, బాహుబలి 2 గణపతి, స్పైడర్ మాన్  గణపతి,  బుల్లెట్ గణపతి ...ఇలా  చిత్ర  విచిత్ర  పద్ధతుల్లో  తయారు చేస్తున్నారు. ఎందుకు  ఇంతటి  దుర్మార్గపు  కృత్యాలు ..?  కాలని లోని  పెద్దలు, మత పెద్దలు, యువకుల  తల్లి తండ్రులు , నాయకులు ఇలాంటివి  చూసి  కూడా  ఎందుకు  నోరు  మెదపడం లేదు....?  ఎందుకు  ప్రోత్సహిస్తున్నారు ..? 


ఇలా పెట్టేవారి కుటుంబీకులు  ఎవరైనా  చనిపోయిన  వారుంటే  వారి  ఫోటోలు  ఇలా తయారు చేసి పెడుతున్నారా...? మన బుద్ధి రాను రాను వక్రీకరించడం   వల్లనే దేశంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇతర మతాల వారు ఇలా మనలాగా వాళ్ళ దేవుణ్ణి కించపరిచినట్టు ప్రవర్తించరు.  ముఖ్యంగా  ఈ విషయంలో యువత తప్పు దారి పడుతుంది.  

ఇక నవరాత్రులు చివరి రోజు  మాత్రం చాలా హంగామా చేస్తారు. తాగడం , ఎగరడం - దూకడం లాంటి కృత్యాలు చేసి మన హిందూ సంస్కృతీ పరువు మనమే తీస్తున్నాము. ఊరేగింపులో బూతు పాటలు. భారీగా ఖర్చు , భయకరమైన సౌండ్ సిస్టం , ఇలా  ప్రతీది తప్పె, అసలు అంత ఖర్చు ఎందుకు పెడ్తున్నారు .  మనకు మన ఋషులు ధారపోసిన జ్ఞానం ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి. 


మండపాల దగ్గర  సినిమా పాటలు పెట్టకండి. వీలైతే భజనలు చేయండి లేదా  ఏమీ చేయకుండా ఉండండి. బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఇలా అడగడం. మీకు శక్తి లేకపోతే పెట్టకండి. పక్క వాళ్ళని చూసి మీకు పోటీలు వద్దు. అవన్నీ మూర్ఖపు పనులు. దయచేసి మానండి. 


మోరీల పైన మండపాలు, రోడ్డు మీద మండపాలు, ఒక్క కాలనిలో 100 మండపాలు. విపరీత పోటీ రాజకీయం... అన్నీ వికృత చేష్టలే . 
చాలా జాగ్రత్తగా  గమనించండి....ఒక మండపం నుండి ఒక్కో  మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు , 100 మండపాల నుండి ఒక్కొక్క మండపం తగ్గుతూ  ఒక కాలనిలో ఒకే మండపం అయితే ఐక్యమత్యo పెరిగినట్లు దీన్ని సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు. ధర్మాన్ని కాపాడి దేశ భవిష్యత్తుకు పునాది వేయండి.  సంస్కతిని కాపాడే బాధ్యత మననుండే మొదలవ్వాలి.
 
ధర్మో రక్షతి రక్షితః
జైబోలో గణేష్ మహరాజ్ కి జై


ఈ అనర్థాలని అపేందుకు ఎక్కడో ఒకచోట ప్రయత్నం ప్రారభం అవ్వాలి. అందరిని కలుపుకొని లేదా ఎవరికి వారుగా విడివిడిగానైన సరే.... మనం ఈ విషయం లో కొన్ని ప్రయత్నాలు చేయగలం. అది మన చేతిలో పని.  
అదేమిటంటే... 

1. ఎవరి కాలనీలోనైనా విరాళాల కోసం మన దగ్గరకు వచినప్పుడు వారితో   ప్రతిమల రూపు గురించి చర్చించి వారు వికృత రూపులతో ఉన్న ప్రతిమలను కొనకుండా  వారించడం. 


2. అర్చకులు_పౌరోహితులు అలాంటి ప్రతిమలు ఉన్న మంటపం లో (పందిరిలో) పూజలు చేసేందుకు నిరాకరించడం 

3. ఎక్కడైన ఇలాంటి ప్రతిమలను పెట్టినట్టు దృష్టికి వస్తే అక్కడికి వెల్లి వారికి వారి చేస్తున్న తప్పు గురించి తెలియచెప్పటం. 
ఇలా సులువైన మార్గాలలో ప్రయత్నించవచ్చు.  

ఇక ధార్మిక సంస్థలు ఈ విషయం లో ముందుకు వచ్చి ఇలాంటి ప్రతిమలు అసలు తయారు కాకుండా  ప్రభుత్వం ఒక చట్టం తెచ్చేలా చూడవలసిన అవసరమున్నది


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: