బీజేపీకి షాక్ ఇవ్వబోతున్న కర్నాటక ప్రజలు..!

Vasishta

దేశాన్ని దున్నేయాలనుకుంటున్న బీజేపీకి కర్నాటకలో అడ్డుకట్ట పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణభారతంలో బీజేపీ కాస్తోకూస్తో సొంతంగా అధికారంలోకి రాగల సత్తా ఒక్క కర్నాటకలోనే ఉంది. అయితే ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.


          కర్నాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీయే మళ్లీ విజయం సాధిస్తుందని సీ ఫోర్ సంస్థ సర్వలో వెల్లడైంది. 2013లో జరిగిన ఎన్నికల్లో నాటి బీజేపీ సర్కార్ ను ఓడించిం కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీకి ఏమాత్రం విజయావకాశాలు లేవని ఆ సంస్థ తేల్చిచెప్పింది.


          వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 120 నుంచి 132 స్థానాలు దక్కుతాయని సీఫోర్ అంచనా వేసింది. బీజేపీకి 60 -72 స్థానాలు, జేడీఎస్ కు 24-30 స్థానాలు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ కు 43 శాతం ఓట్లు, బీజేపీకి 32 శాతం ఓట్లు దక్కుతాయని ప్రకటించింది. కర్నాటకలో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.


          ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 123 స్థానాలుండగా, బీజేపీకి 44, జేడీఎస్ కు 32 స్థానాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇప్పడున్న స్థానాల కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని సీ ఫోర్ అంచనా వేసింది. బీజేపీ బలం పెరిగినప్పటికీ అధికారంలోకి వచ్చేందుకు అది సరిపోదని సర్వే తేల్చింది. మరి బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: