భారత్ ను నిన్నొదల బొమ్మాళీ! అంటూ నేపాల్ ద్వారా సవాల్ చేస్తున్న చైనా
భారత్ ను భౌగళికంగా దెబ్బతీయటానికి "భూటాన్" ద్వారా లడాయి పెట్టుకుని అవమానం పొందిన చైనా ఇప్పుడు టిబెట్ -నేపాల్ సరిహద్దులను కలిపే, టిబెట్ లోని గతం లో మూసివేసిన సుదీర్ఘ జాతీయరహదారిని పునఃప్రారంభించింది. టిబెట్ లోని "జిగాజే విమానాశ్రయం" నుంచి ఆ నగర కేంద్రం వరకు విస్తరించి ఉన్న 40.4 కిలో మీటర్లు, పొడవు, 25 మీటర్ల వెడల్పైన సువిశాల ప్రధాన రహదారిని (హైవే) శుక్రవారం ప్రజా రవాణా కోసం తెరిచినట్టు అధికార పత్రిక "గ్లోబల్ టైమ్స్" ఒక కథనం ప్రచురించింది. దీనివల్ల ప్రయాణ సమయం గంట నుంచి అర గంటకు కుదించబడుతుందని వివరించింది. అయితే, పౌరప్రయాణ అవసరాల కోసం అంటూ, వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం చైనా తీసుకొందని సైన్యానికి చెందిన అనేక మంది నిపుణులు భావిస్తున్నారు.
ఎప్పటినుండో చైనా నుంచి నేపాల్‌కు భూ మార్గం ద్వారా "రైల్వే-లైన్" వేయాలని, తద్వారా దక్షిణాసియాలోకి చొచ్చుకు రావాలని చైనా ప్రణాళిక లోని తొలి అంకానికి తెరలేపింది. ఈ నిర్ణయం అందులో భాగమేనని, భౌగోళికంగా భారత్ ను మరోసారి లక్ష్యంగా గురి పెడుతూ కొత్త సవాల్ బలంగా చేసినట్టే అవుతుందని అంటున్నారు. అయితే ఇది నేపాల్ చైనా ఇరు దేశాలు చేసుకున్న "నేపాల్-చైనా సిల్క్ రోడ్ & ఎకనమిక్ బెల్ట్" ఒప్పందానికి పొడిగింపు అన్నమాట.
China opens dual-use highway to Nepal via Tibet