అమ్మ నా డ్రాగనో...!

veeru

తన అవసరం కోసం ఎంత అడ్డంగానైనా వాదించడం చైనాకు అలవాటు. ప్రపంచం ఏమై పోయినా తనకు అక్కర్లేదు. తన ప్రయోజనాలే ముఖ్యం... ఇప్పుడు మయన్మార్ విషయంలోనూ తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకుంది డ్రాగన్...రోహింగ్యాల వివాదం అందరికీ తెలిసిందే. మయన్మార్ సైన్యం ఊచకోత కోస్తుంటే పొట్టచేత పట్టుకుని బంగ్లాదేశ్ కు పారిపోతున్నారు. ప్రపంచదేశాలు, ఐక్యరాజ్యసమితి కూడా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని గుండెలు బాదుకుంటున్నాయి. 


ఐదులక్షల మంది రోహింగ్యాలు దేశం వదిలిపోయిన దృశ్యాలు కళ్లకు కనబడుతున్నాయి. అయినా చైనా మాత్రం అది మయన్మార్ అంతర్గత వ్యవహారమని ఇంకొకరి జోక్యం అవసరం లేదని వ్యాఖ్యానించింది. పైగా ఆ ప్రాంతంలో సుస్థిరత తీసుకురావడం కోసం మయన్మార్ చేస్తున్న ప్రయత్నమని వెనకేసుకొచ్చింది.నిన్నటిదాకా డోక్లామ్ విషయంలో మయన్మార్ ను వేధించిన చైనాకు ఇంత హఠాత్తుగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా అని ఆలోచిస్తే అసలు సంగతి బయటపడింది.


తన మిత్రదేశమైనా మయన్మార్ రోహింగ్యాల విషయంలో భారత్ ఆ దేశాన్ని సమర్ధించలేదు. అందుకే చైనా మయన్మార్ ను వెనకేసుకొచ్చి మంచి మార్కులు కొట్టేయడానికి ప్లాన్ చేసింది.మన రెండు దేశాలు చిరకాల మిత్రులు. ఇప్పుడు రోహింగ్యాలను అడ్డుపెట్టుకుని దానికి తూట్లు పొడవాలన్నది డ్రాగన్ ప్లాన్. భవిష్యత్ లో మనం తనతో పోటీ పడకుండా ఈ కుట్ర అన్నమాట. ఇప్పటికే పాకీ పనులు చేస్తున్న పాక్ ను ప్రోత్సహిస్తోంది.


టిబెట్ ను కూడా తనవైపు తిప్పుకుంది.  శ్రీలంకకు తాయిలాలు ఆశచూపింది. ఇప్పుడు మయన్మార్ ను కూడా తనవైపు తిప్పుకుంటే భారత సరిహద్దు దేశాలన్నీ తన కంట్రోల్ లో ఉంటానయ్నది డ్రాగన్ కడుపులోకి కుట్ర. అందుకే ఈ అడ్డగోలు వాదన. అమ్మో తన అవసరాల కోసం చైనా ఏమైనా చేయగలదు. నీతి, న్యాయం దానికి అవసరం లేదు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: