ఆ ఒక్క హామీతో జగన్ టీడీపి ని దెబ్బకొడుతున్నాడు... !

Prathap Kaluva

 వైస్సార్సిపి అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. తన పాదయాత్ర 600 కిలో మీటర్లు దాటుకొని 44 వ రోజు కొనసాగిస్తున్నాడు. అయితే తన పాదయాత్ర కు జనాల నుంచి విశేష స్పందన వస్తుంది. రోజు రోజుకు తన హామీల వర్షం పెరుగుతూ వస్తుంది. ఎవరైనా తన పాదయాత్ర లో అన్నా మాకు ఇది ప్రాబ్లం ఉంది దాన్ని నెరవేర్చండి అంటే చాలు దాన్ని హామీగా ఇచ్చేస్తున్నాడు. విశ్లేషకులు కూడా జగన్ హమీలను గమనిస్తున్నారు.


రోజు రోజుకు హామీలు ఎక్కువ అవ్వడంతో జగన్ వాటిని నెరవేర్చగలడా అని సామాన్య జనాలు కూడా అనుకుంటున్నారు. అయితే హామీలు రాజకీయ నాయకులు నెరవేర్చిన నెరవేర్చక పోయిన వాటికి జనాలు ఆకర్షితులు అవ్వడం సహజం. పోయిన సారి కూడా జగన్ హామీలతో పోలిస్తే, చంద్ర బాబు నాయుడు హామీలు ఎక్కువ మరియు కొన్ని ఆచరణ సాద్యం కానివి ఉన్నవి.


అయినా సరే జనాలు వాటిని నమ్మి టీడీపి ని గెలిపించారు. తరువాత చంద్ర బాబు నాయుడు వాటిని నేరవేర్చాడా లేదా అనేది తరువాత సంగతి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం జగన్ గుప్పిస్తున్నా హామీలు టీడీపి ని  ఎంత వరకు దెబ్బ గొట్టగలవు. అయితే ఇందులో ఒక్క హమీ మాత్రం టీడీపి ని ఖచ్చితంగా దెబ్బ గొట్టగలదని అందరు అంచనా వేస్తున్నారు. 


అదేదో కాదు 45 ఏళ్లకే పెన్షన్ ఎందుకంటే ఈ హామీ అనేది ఒక రాజకీయ నాయకుడు నుంచి వినడం ఇదే మొదటిసారి పైగా ఈ వయస్సు  కలిగిన వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారని అంచనా. మరియు స్టూడెంట్స్ కు హాస్టల్ ఫీజు కోసం 20, 000 రూపాయాలు. ఇంత వరకు ఏ గవర్నమెంట్ స్టూడెంట్స్ కు హాస్టల్ ఫీజు కోసం 20,000 రూపాయలు ఇవ్వలేదు. పైగా యువత జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హామీ టీడీపికి దెబ్బ లాంటిదని విశ్లేషకలు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: