ఏపీలో మద్యం మాఫియా జోరుగా పెరిగింది : జగన్

siri Madhukar
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రలో అనంతపురం జిల్లాలో సాగుతున్న ఆయన కదిరి నియోజకవర్గం పరిధిలో సభలో ప్రసంగిస్తూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియా బాగా పెరిగిపోయిందని అన్నారు.  తామ పార్టీ అధికారంలోకి వస్తే.. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం అని మరోసారి ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.  ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవిలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచారు. 

ఒక పక్క రెవెన్యూ కోసం అంటూనే అక్రమార్కులతో మద్యం మాఫియా పెరిగిపోతుందని విమర్శించారు.  దీంతో ఎంతో మంది అక్కచెల్లెల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని..మద్యం మత్తులు పురుషులు విచక్షణ కోల్పోతున్నారని విమర్శించారు.   మద్యపాన నిషేధం అమల్లో పెట్టిన తర్వాతే మళ్లీ ఓటు అడగడానికి ప్రజల ముందుకు వస్తామని జగన్ ప్రకటించారు.  పిల్లలను స్కూల్ కు పంపే తల్లులకు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ‘నవరత్నాలు’లోని హామీని జగన్ పునరుద్ఘాటించారు.

డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. గత ఎన్నికల ముందు డ్వాక్రా రుణమాఫీ హామీని ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని.. జగన్ ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆరు వందల కిలోమీటర్లు పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం జగన్ పాదయాత్ర కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాగుతోంది. నేటితో ప్రజాసంకల్ప యాత్ర 46వ రోజుకు చేరుకుంది. కదిరి నియోజకవర్గం దాటిన అనంతరం జగన్ చిత్తూరు జిల్లాలోకి ఎంటర్ కానున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: