రఘువీరా కాంగ్రెస్ కు హ్యాండిచ్చి.. టీడీపీకి జైకొట్టబోతున్నారా..?

Vasishta

“వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోను.. ఆ పని చేస్తే టీడీపీ తరపున ప్రచారం చేస్తా..!” అంటూ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకూ ఆయన ఏ సందర్భంలో ఆ మాటలన్నారు.. ఎందుకున్నారు..? నిజంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయట్లేదా..? ఒక్కసారిగా ఆయన టీడీపీ జెండా పట్టుకుంటానని ఎందుకున్నారు...?


రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో మనకు తెలిసిందే! దిక్కూమొక్కూలేకుండా పోయింది. ఒక్క చోట కూడా గెలవలేదు. డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. నాలుగేళ్లయినా ఆ పార్టీ తీరులో మార్పు కనిపించడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ పైన రాష్ట్ర ప్రజల్లో అంత వ్యతిరేకత గూడుకట్టుకుపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఇంతకుమించి పురోగతి సాధిస్తుందని ఊహించే పరిస్థితి లేదు.


ఈ నేపథ్యంలో సాక్షాత్తూ పీసీసీ చీఫ్ రఘువీరా చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కల్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు ఇస్తే తాను టీడీపీ జెండా పట్టుకుని ఆ పార్టీ తరపున పోటీ చేస్తానని రఘువీరా చెప్పారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోనని స్పష్టం చేశారు. దీంతో – కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి.


వాస్తవానికి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అధికార తెలుగుదేశం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మంచి వర్షాలు నమోదవడంతో జలకళ సంతరించుకున్నాయి చెరువులన్నీ.! మిగిలిన చోట్ల హంద్రీనీవా ద్వారా నీళ్లందిస్తోంది. దశలవారీగా కృష్ణదేవరాయలకాలం నాటి చెరువులన్నింటినీ పునర్వినియోగంలోకి తీసుకొస్తామని చంద్రబాబు సర్కార్ చెప్తోంది. అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇదే జరిగితే తాను కూడా టీడీపీ తరపునే ప్రచారం చేస్తానన్నారు రఘువీరా రెడ్డి. మరి కల్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులకు ప్రభుత్వం నీళ్లిస్తుందా.. టీడీపీ తరపున రఘువీరా ప్రచారం జరిగేలా దేశం నేతలు ట్రై చేస్తారా..? ఏం జరగబోతుందో చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: