తాజ్‌మహల్‌ అందాలు అద్భుతం : ఇజ్రాయెల్ ప్రధాని

Narayana Molleti

భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పర్యటిస్తున్నారు. భారత్‌లో ఆయన ఆరు రోజులపాటు పర్యటించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో బెంజమిన్ నెతన్యాహుకు సాదర స్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ ప్రధానికి ఆహ్వానం పలికారు. భారత్ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధానుల్లో బెంజమిన్ రెండోవాడు. 15 సంవత్సరాల క్రితం 2003లో అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని అరెల్ షరోన్ భారత్‌లో పర్యటించారు.  


 బెంజమిన్ నేతన్యహు తన ఆరు రోజుల పర్యటనలో భాగంగా , సతీమేతంగా, ఉత్తర ప్రదేశ్ లోని , ప్రేమకు చిహ్నం అయిన తాజ్ మహల్ ను ఈ మంగళవారం సందర్శించారు.  బెంజమిన్ మరియు అతని సతీమణి సారా కు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గణ స్వాగతం పలికారు. బెంజమిన్ , సారా  తాజ్ మహల్ ప్రాంగణం లో గంటకు పైగా సమయం గడపనున్నట్లు తెలుస్తోంది. 


ఈ ముఖ్య అతిధి రాక  కోసం కట్టు దిట్టమైన  బద్రత ఏర్పాటు చేశారు. తాజ్ మహల్ ప్రాంగణం లో కి ఒక్క వాహనం కుడా రానివ్వలేదు. యమునా నదీ దక్షిణ ఒడ్డు పై ఉన్నటువంటి  ఐవొరి మర్బ్ ల్   సమాధిని సైతం మూసివేసారు. ముఖ్య అతిధులు ఆ  ప్రాంతము నుండి వెళ్ళిన తరువాత ప్రజల సందర్శనార్దం   తెరవడంజరుగుతుంది. రానున్న మూడు సంవత్సరాలలో  ఇజ్రాయెల్  భారత దేశానికి  పంపే ఎగుమతులను 25%  పెంచాలి అని భావిస్తోంది. ఈ పర్యటన వలన భరత్ ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవ్వనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: